అన్వేషించండి

Sweet Cravings During Weight Loss : బరువు తగ్గాలని షుగర్స్ మానేశారా? స్వీట్ క్రేవింగ్స్ వస్తే ఈ హెల్తీ ఆప్షన్స్ ట్రై చేయండి

Weight Loss Journey : షుగర్స్ మానేసి పూర్తిగా డైట్ మీద ఫోకస్ చేసినప్పుడు చాలామందికి స్వీట్ క్రేవింగ్స్ వస్తాయి. అలాంటి సమయంలో ఒకేసారి పూర్తిగా డైట్​ని పాడు చేసుకోకుండా ఈ హెల్తీ ఆప్షన్స్ ట్రై చేయండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బరువు తగ్గడానికి స్వీట్స్ మానేయడం మంచిదే, అయితే కంట్రోల్ చేసుకోలేకపోతే మూడ్ స్వింగ్స్ వస్తాయి.
  • చాక్లెట్లు, బిస్కెట్లకు బదులు స్టీవియా, సీజనల్ ఫ్రూట్స్, ఖర్జూరాలు వంటివి వాడండి.
  • తేనె, బెల్లం, నట్స్ వంటివి కొద్ది మోతాదులో తీసుకుంటే తీపి కోరికలు అదుపులో ఉంటాయి.
  • ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంతో పాటు పోర్షన్ కంట్రోల్ బరువు తగ్గడానికి ముఖ్యం.

Craving Sweets While Dieting : బరువు తగ్గాలని డిసైడ్ అయినప్పుడు చాలామంది చేసే మొదటి మార్పు స్వీట్స్ మానేయడం. షుగర్స్​కి వీలైనంత దూరంగా ఉండడం ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగమే. అయితే కొన్నిసార్లు స్వీట్ క్రేవింగ్స్ బాగా ఇబ్బంది పెట్టేస్తాయి. తినకూడదని కంట్రోల్ చేసుకుంటే మూడ్ స్వింగ్స్, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఇంక ఒకేసారి బ్లాస్ట్ అయిపోయి స్వీట్స్ తినేస్తూ ఉంటారు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదని చెప్తున్నారు నిపుణులు.

స్వీట్ క్రేవింగ్స్ వస్తే..

మీకు స్వీట్ క్రేవింగ్స్ వస్తే చాక్లెట్లు, బిస్కెట్లు వంటివి కాకుండా హెల్తీ ఆప్షన్స్ తీసుకోమని సూచిస్తున్నారు డైటీషియన్స్. అలాగే శరీరానికి శక్తిని ఇవ్వడానికి షుగర్స్ అవసరం అని కూడా చెప్తున్నారు. అయితే మీరు ఎలాంటి షుగర్స్ ఎంచుకుంటున్నారనేది ముఖ్యం అని అంటున్నారు. మీరు స్వీట్స్ మానేసి.. స్వీట్ క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవాలంటే.. బరువుని అదుపులో ఉంచే కొన్ని ఆరోగ్యకరమైన ఎంపికలు ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు. మరి ఈ హెల్తీ ఆప్షన్స్ ఏంటో.. అవి క్రేవింగ్స్ ఎలా కంట్రోల్ చేస్తాయో చూసేద్దాం. 

సీజనల్ ఫ్రూట్స్..

మధ్యాహ్నం లేదా సాయంత్రం మీకు స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు పేస్ట్రీలు, చాక్లెట్ లేదా బిస్కెట్లకు బదులుగా తాజా పండ్లు తినడానికి ప్రయత్నించండి. ఆపిల్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, నారింజ, జామ, బొప్పాయి వంటి పండ్లలో సహజమైన తీపి ఉంటుంది. వీటిలో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉండి.. ఎక్కువసేపు ఆకలికాకుండా చేస్తాయి. 

ఖర్జూరాలు 

ఖర్జూరాలను ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన బహుమతిగా చెప్తారు. ఇవి తీపిగా ఉండటమే కాకుండా, పీచుపదార్థం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్​ కూడా పుష్కలంగా కలిగి ఉంటుంది. బరువు తగ్గే క్రమంలో మీకు తీపి తినాలనే కోరిక ఎక్కువగా ఉంటే.. మీరు ఒకటి లేదా రెండు ఖర్జూరాలను తినవచ్చు. లేదా స్మూతీలు, ఓట్‌మీల్ లేదా హెల్తీ షేక్స్ చేసేటప్పుడు ఖర్జూర గుజ్జును వేసుకోవచ్చు. దీనిలో సహజ కేలరీలు ఉంటాయి కాబట్టి.. తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.

తేనె

మీకు స్వచ్ఛమైన లేదా సేంద్రీయ తేనె దొరుకుతుంది అనుకుంటే మీరు అదృష్టవంతులే. ఎందుకంటే ఇది చక్కెరలా కాకుండా.. అనేక యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది. తేనె శరీర జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ తేనెను నిమ్మరసంతో కలిపి తాగితే శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. అయితే తేనెలో కేలరీలు ఉంటాయి కాబట్టి.. తక్కువ మోతాదులో రుచికోసం తీసుకుంటే మంచి ఫలితాలు చూస్తారు. 

స్టీవియా

స్టీవియా అనేది ఒక మొక్క. దీని ఆకులను స్వీటెనర్స్​గా ఉపయోగిస్తారు. ఇది చక్కెర కంటే సుమారు 200 రెట్లు ఎక్కువ తీపిగా ఉంటుంది. కానీ దీనిలో కేలరీలు లేదా కార్బోహైడ్రేట్లు ఉండవు. అంతేకాకుండా ఇది రక్తంలో చక్కెర లేదా ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేయదు. బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహం ఉన్నవారికి అత్యంత సురక్షితమైన, ఉత్తమమైన ఎంపికగా చెప్తారు. కాబట్టి మీరు దీన్ని మీ మార్నింగ్ టీ, కాఫీ లేదా నిమ్మరసంలో కలిపి తీసుకోవచ్చు. 

బెల్లం 

చాలామంది షుగర్​కి బదులు బెల్లం ఉపయోగిస్తారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే బెల్లాన్ని కూడా షుగర్​తో తయారు చేస్తారు. అలా కాకుండా సహజంగా చేసే బెల్లం తీసుకోవచ్చు. అలాంటి బెల్లంలో ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి అవసరమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను బలపరుస్తాయి. భోజనం తర్వాత చాలా మందికి తీపి తినాలనిపిస్తుంది. అటువంటి సందర్భాలలో.. చక్కెరతో చేసిన స్వీట్స్​కి బదులుగా ఒక చిన్న బెల్లం ముక్క తినొచ్చు. అయితే ఇది కూడా చాలా తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. 

నట్స్ 

బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ వంటి నట్స్‌లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్వీట్ క్రేవింగ్స్ అదుపులో ఉంచుతాయి. కాబట్టి వీటిని డైట్​లో చేర్చుకోవచ్చు. 

అయితే ఇవన్నీ మీకు హెల్తీ ఆప్షన్స్ మాత్రమే. వీటిని లిమిటెడ్​గా తీసుకుంటూ.. మీ డైట్​, వ్యాయామాన్ని ఫాలో అయితే కచ్చితంగా బరువు తగ్గుతారు. కాబట్టి పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు నిపుణులు. 

ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Drink Too Much Tea : టీ ఎక్కువగా తాగుతున్నారా? నిద్రలేమి, రక్తహీనతతో పాటు ఈ సమస్యలు రావొచ్చంటున్న వైద్యులు
టీ ఎక్కువగా తాగుతున్నారా? నిద్రలేమి, రక్తహీనతతో పాటు ఈ సమస్యలు రావొచ్చంటున్న వైద్యులు
Reduce Blood Sugar Levels : మందులు లేకుండానే షుగర్ లెవెల్స్ తగ్గాలా? రోజుకు 15 నిమిషాలు ఈ పని చేస్తే చాలు అంటున్న నిపుణులు
మందులు లేకుండానే షుగర్ లెవెల్స్ తగ్గాలా? రోజుకు 15 నిమిషాలు ఈ పని చేస్తే చాలు అంటున్న నిపుణులు
Kidney Problems : కిడ్నీ ఫెయిల్యూర్‌కు ముందే కనిపించే లక్షణాలు ఇవే.. ఈ వార్నింగ్ సిగ్నల్స్ లైట్ తీసుకోకండి
కిడ్నీ ఫెయిల్యూర్‌కు ముందే కనిపించే లక్షణాలు ఇవే.. ఈ వార్నింగ్ సిగ్నల్స్ లైట్ తీసుకోకండి
Drinking Water After Tea : టీ తాగిన వెంటనే నీళ్లు తాగకూడదా? ముందు తాగితే మంచిదా? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే
టీ తాగిన వెంటనే నీళ్లు తాగకూడదా? ముందు తాగితే మంచిదా? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
King Maker CBN: పాతాళం నుంచి శిఖరాగ్రానికి - రెండేళ్లలోనే దేశ రాజకీయాన్ని శాసించే పవర్‌ఫుల్ లీడర్‌గా చంద్రబాబు ‘రైజ్’ !
పాతాళం నుంచి శిఖరాగ్రానికి - రెండేళ్లలోనే దేశ రాజకీయాన్ని శాసించే పవర్‌ఫుల్ లీడర్‌గా చంద్రబాబు ‘రైజ్’ !
Raghava Lawrence : మీరు ఎస్ అంటేనే... లేకుంటే... - పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్
మీరు ఎస్ అంటేనే... లేకుంటే... - పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్
US Iran Deal: ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది, త్వరలోనే సంతకాలు చేసుకుంటాం: Donald Trump
ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది, త్వరలోనే సంతకాలు చేసుకుంటాం: Donald Trump
Telangana Congress Internal Conflicts: తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిపోతున్న వర్గ పోరాటం - పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ఆడియో లీకులు - చక్కదిద్దేదెవరు?
తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిపోతున్న వర్గ పోరాటం - పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ఆడియో లీకులు - చక్కదిద్దేదెవరు?
Vijay Deverakonda: విజయ్ దేవరకొండను నాగ్ అశ్విన్ వదల్లేదుగా... లేటెస్ట్ 'సింగ్ గీతం'లోనూ
విజయ్ దేవరకొండను నాగ్ అశ్విన్ వదల్లేదుగా... లేటెస్ట్ 'సింగ్ గీతం'లోనూ
US Military Attack: పరిస్థితి బాగోలేదని నా భర్త ముందే చెప్పాడు, లిస్టులో ఫస్ట్ పేరు ఆయనదే.. చీఫ్ ఇంజనీర్ భార్య భార్గవి
పరిస్థితి బాగోలేదని నా భర్త ముందే చెప్పాడు, లిస్టులో ఫస్ట్ పేరు ఆయనదే.. చీఫ్ ఇంజనీర్ భార్య భార్గవి
TMC Crisis 2026: యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
Janasena Delhi Meeting: ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
Embed widget