Butter Chicken Roast Recipe : టేస్టీ, జ్యూసీ బటర్ చికెన్ రోస్ట్.. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ ఇదే
Tasty and Juicy Chicken Recipe : చికెన్‌తో కొత్తగా, టేస్టీగా ఏమైనా డిష్ ఇంట్లోనే చేసుకుని తినాలి అనుకుంటున్నారా? అయితే బటర్ చికెన్ రోస్ట్ బెస్ట్ ఆప్షన్. దీని పూర్తి రెసిపీని ఇప్పుడు చూసేద్దాం.

Tender and Juicy Butter Chicken Roast : చికెన్‌ని చాలామంది ఇష్టంగా తింటారు. పైగా దీనిని వివిధ రకాలుగా చేసుకుంటారు. అయితే మీరు జ్యూసీగా, టేస్టీగా ఉండే చికెన్ తినాలనుకుంటే బటర్ చికెన్ రోస్ట్ తయారు చేసుకోవచ్చు. దీనిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకోగలిగి రెసిపీ ఇది. మరి ఈ డిష్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో.. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం.
బటర్ చికెన్ రోస్ట్ కోసం కావాల్సిన పదార్థాలు
చికెన్ - అరకేజీ
నిమ్మరసం - 2 టీస్పూన్లు
పెరుగు - ముప్పావు కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర్ టేబుల్ స్పూన్
బటర్ - పావు కప్పు
వేయించిన ఉల్లిపాయలు - అర కప్పు
కారం - ఒకటిన్నర టేబుల్ స్పూన్
కశ్మీరీ కారం - 2 టేబుల్ స్పూన్స్
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
మిరియాల పొడి - 1 టీస్పూన్
చికెన్ మసాలా - ఒకటిన్నర టీస్పూన్
స్పెషల్ మసాలా కోసం..
వేయించిన ఉల్లిపాయలు - పావు కప్పు
వెల్లుల్లి - 10 రెబ్బలు
జీలకర్ర - ఒకటిన్నర టీస్పూన్
కారం - 1 టేబుల్ స్పూన్
బటర్ - పావు కప్పు
నీళ్లు - అరకప్పు
కరివేపాకు - 2 రెబ్బలు
కొత్తిమీర - 1 కట్ట తురుము
తయారీ విధానం
బటర్ చికెన్ రోస్ట్ కోసం ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. ముందుగా పెద్ద గిన్నెలోకి చికెన్ తీసుకోవాలి. దానిలో నిమ్మరసం, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బటర్, వేయించిన ఉల్లిపాయలు, కారం, కశ్మీరి కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాల, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, చికెన్ మసాల పొడి వేసి చికెన్‌కు బాగా అంటుకునేలా కలపాలి. చేతితో కలిపితే మసాలా చికెన్‌కు బాగా అంటుకుంటుంది. ఇలా సిద్ధం చేసుకున్న చికెన్‌ను ఓ పది నిమిషాలు పక్కన పెట్టేయాలి.
స్పెషల్ మసాలా
రోస్ట్కోసం స్పెషల్ మసాలా చేసుకోవాలి. దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని.. దానిలో ఫ్రైడ్ ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కశ్మీరి కారం వేసి మిక్సీ చేసుకోవాలి. దీనిని పక్కన పెట్టుకుని ముందుగా స్టౌవ్ వెలిగించాలి. దానిలో కాస్త బటర్ వేసుకుని అది కరిగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుని 5 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇలా చేసుకునేప్పుడు గ్యాస్ మంట ఎక్కువగా పెట్టుకుని బాగా కలుపుతూ ఉండాలి.
ఇప్పుడు చికెన్‌లో నీళ్లు వేసి.. మూత పెట్టి మీడియం మంట మీద పది నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్ కాస్త ఉడికిన తర్వాత ముందగా మిక్సీలో సిద్ధం చేసుకున్న స్పెషల్ మసాలా వేసుకోవాలి. బాగా కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు దానిలో కరివేపాకు వేసి తిప్పి మరో రెండు నిమిషాలు అలా వదిలేయాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి టేస్ట్ చూసుకుని సాల్ట్ వేసుకుని మరోసారి కలిపి స్టౌవ్ ఆపేయాలి. అంతే టేస్టీ బటర్ చికెన్ రోస్ట్ రెడీ.
ఈ జ్యూసీ, టేస్టీ బటర్ చికెన్ రోస్ట్ని మీరు చపాతీలు, రోటీల్లోనే కాకుండా.. రైస్‌లో, బగారా రైస్‌లో కూడా కలిపి తీసుకోవచ్చు. అరగంటలో ఈజీగా చేసుకోగలిగే ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసేసుకోండి. మీరు ఎంచుకునే చికెన్ కొలత బట్టి.. కారం, ఉప్పు రుచులు చెక్ చేసుకుంటూ.. ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ చేసుకోండి.
మరిన్నీ టేస్టీ రెసిపీల కోసం దీనిని క్లిక్ చేయండి.
Before You Go
Simple Yoga for Body Fat | చెడు కొవ్వును సింపుల్ యోగాసనాలతో దూరం చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























