అన్వేషించండి

Animal Menstruation: జంతువులకు నెలసరి వస్తుందా? ఇది మనుషులకే పరిమితమైందా? 

Animal Menstruation: పునరుత్పత్తి ప్రక్రియలో నెలసరిది కీలక పాత్ర. అలాంటి నెలసరి జంతువుల్లో ఉంటుందా? లేదంటే మనుషులకే ఇది పరిమితమైందా? ఈ ప్రకృతి రహస్యం గురించి తెలుసుకుందాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మానవులు, కొన్ని జంతువుల్లోనే నెలసరి ప్రక్రియ కనిపిస్తుంది.
  • గర్భం ధరించనప్పుడు గర్భాశయ పొర బయటకు వస్తుంది.
  • ప్రైమేట్లు, గబ్బిలాలు, స్పైనీ ఎలుకల్లో నెలసరి వస్తుంది.
  • కుక్కలు, పిల్లుల్లో కనిపించేది నెలసరి కాదు, వేరే ప్రక్రియ.

Animal Menstruation: ప్రకృతిలో పునరుత్పత్తి అనేది ఒక నిరంతర ప్రక్రియ. అయితే మనుషుల్లో కనిపించే నెలసరి లేదా రుతుచక్రం(Menstruation) అనేది జంతు ప్రపంచంలో అత్యంత అరుదైన విషయం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 5,502 క్షీరద జాతుల్లో కేవలం రెండు శాతం కంటే తక్కువ జాతుల్లో మాత్రమే ఈ ప్రక్రియ కనిపిస్తుంది. అంటే మిగిలిన 98 శాతం జంతువుల్లో సంతానోత్పత్తి వ్యవస్థ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. స్పైనీ ఎలుకల వంటి జీవుల్లో కూడా నెలసరిని గుర్తించడం వైద్య రంగంలో సరికొత్త చర్చకు దారి తీసింది. 

నెలసరి ఎందుకు ఏర్పడుతుంది?

చాలా జంతువుల్లో ఈస్ట్రిస్ సైకిల్ ఉంటుంది. ఇక్కడ గర్భం దాల్చనప్పుడు గర్భాశయం పొరను శరీరం రీఅబ్జార్బ్‌ చేసుకుంటుంది. కానీ మనుషులు, కొన్ని ప్రత్యేక జంతువుల్లో మాత్రం ఈ పొర బయటకు వచ్చేస్తుంది. దీనికి ప్రధాన కారణం స్పాంటేనియస్ డెసిడ్యువలైజేషన్. 

రుతుచక్రం కలిగిన జంతువులలో పిండం గర్భాశయానికి చేరుకోక ముందే తల్లి శరీరం గర్భాసయం పొరను మందంగా రెడీ చేసి పెడుతుంది. ఇది ఒక రకమైన క్వాలిటీ చెక్ లోపభూయిష్టమైన పిండాలను గుర్తించి, అవి గర్భాశయానికి అంటుకోకుండా నిరోధించడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. పిండం సరిగా లేనప్పుడు లేదా గర్భం దాల్చనప్పుడు, ఆ పొర అనవసరమైన రక్తం రూపంలో బయటకు వస్తుంది. దీనినే మనం నెలసరి అంటారు. 

నెలసరి ఏ ఏ జాతుల్లో కనిపిస్తుంది?

ప్రకృతిలో నెలసరి అనేది ప్రధానంగా నాలుగు విభిన్న వర్గాల్లో కనిపిస్తుంది. ప్రైమేట్లు, గబ్బిలాలు, ఎలిఫెట్ ష్రూ, స్పైనీ ఎలుకల్లో మాత్రం నెలసరి వస్తుంది. ప్రైమేట్లు అంటే చింపంజీలు, ఇతర కోతి జాతుల్లో మనుషులకు దగ్గరి సంబంధం ఉంటుంది. వీటి రుతు చక్రం సుమారు 35 రోజుల నుంచి 36 రోజులు ఉంటుంది. చింపాజీలలో నెలసరి సమయంలో శారీరక మార్పులు, ముఖ్యంగా జననేంద్రియాలు వద్ద వాపు స్పష్టంగా కనిపిస్తుంది. గొరిల్లాలు మూడు రోజులు, ఒరాంగుటాన్లు ఒకటి నుంచి నాలుగు రోజులు రక్తస్రావం అనుభిస్తాయి. 

ఎలుక వంటి జాతుల్లో ఎప్పుడూ ఉండదని భావించిన శాస్త్రవేత్తలకు కైరో స్పైనీ ఎలుక ఆశ్చర్య కలిగించింది. 2016లో జరిగిన పరిశోధనల్లో ఈ ఎలుకలకు 9 రోజుల రుతుచక్రం ఉంటుందని అందులో 3 రోజులు రక్తస్రావం జరుగుతుందని గుర్తించారు. ఎలుకలలో ఇటువంటి ప్రక్రియను గుర్తించడం ఇదే మొదటిసారి. ఎలుకలా కనిపించినా ఏనుగల వర్గానికి చెందిన ఎలిఫెంట్‌ ష్రూలో కూడా రుతుచక్రం 12 రోజులు ఉంటుంది. వీటిలో సంతానోత్పత్తి సీజన్ ముగిసిన తర్వాత నెలసరి వంటి ప్రక్రియ కనిపిస్తుంది.  

గబ్బిలాలలోని కొన్ని జాతుల్లో ముఖ్యంగా ఫుల్వస్‌ ఫ్రూట్ బ్యాట్లో 33 రోజుల రుతుచక్రం ఉంటుంది. వీటిలో రక్తస్రావం కేవలం ఒక రోజు మాత్రమే జరుగుతుంది. సెబాస్‌ షార్ట్ టెయిల్డ్‌ బ్యాట్‌ వంటి వాటిలో 21 నుంచి 27 రోజుల సైకిల్ ఉంటుంది.  

నెలసరికి ఈస్ట్రస్‌కి తేడా ఏంటీ?

చాలా మంది కుక్కలు లేదా పిల్లులకు కూడా నెలసరి వస్తుందని పొరపాటు పడుతుంటారు. కానీ అది నిజం కాదు. కుక్కల్లో కనిపించే రక్తస్రావం ప్రో ఈస్ట్రస్ బ్లీడింగ్. ఇది ఈస్ట్రోజెన్ హార్మోన్ పెరగడం వల్ల రక్తనాళాల నుంచి వచ్చే స్రావం, కానీ గర్భాశయ పొర విచ్చిన్నం కావడం వల్లే వచ్చేది కాదు. ఈస్ట్రస్‌ సైకిల్‌లో జంతువు కేవలం ఆ హీట్‌ సమయంలోనే కలయికకు అంగీకరిస్తుంది. గర్భం రాకపోతే పొరను శరీరం తనలోకి తీసుకుంటుంది. కానీ మెన్స్ట్రువల్‌ సైకిల్‌లో కలయిక ఎప్పుడైనా జరగవచ్చు. గర్భం రాకపోతే పొర రక్తం రూపంలో బయటకు వచ్చేస్తుంది. 

Frequently Asked Questions

ప్రకృతిలో నెలసరి అనేది ఎంత అరుదు?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 5,502 క్షీరద జాతుల్లో రెండ శాతం కంటే తక్కువ జాతుల్లో మాత్రమే నెలసరి కనిపిస్తుంది. మిగిలిన 98 శాతం జంతువుల్లో సంతానోత్పత్తి వ్యవస్థ భిన్నంగా ఉంటుంది.

జంతువులలో నెలసరి ఎందుకు ఏర్పడుతుంది?

గర్భం దాల్చనప్పుడు గర్భాశయం పొరను శరీరం రీఅబ్జార్బ్ చేసుకోకుండా, అది రక్తం రూపంలో బయటకు రావడమే నెలసరికి కారణం. ఇది లోపభూయిష్టమైన పిండాలను నిరోధించడానికి ఉపయోగపడుతుంది.

ఏ ఏ జంతు జాతులలో నెలసరి కనిపిస్తుంది?

నెలసరి ప్రధానంగా ప్రైమేట్లు (చింపాంజీలు, కోతులు), గబ్బిలాలు, ఎలిఫెంట్ ష్రూ, మరియు స్పైనీ ఎలుకల వంటి జాతులలో కనిపిస్తుంది.

కుక్కలు, పిల్లులకు నెలసరి వస్తుందా?

లేదు, కుక్కలు లేదా పిల్లులకు నెలసరి రాదు. వాటిలో కనిపించేది ప్రో ఈస్ట్రస్ బ్లీడింగ్, ఇది ఈస్ట్రోజెన్ హార్మోన్ వల్ల వస్తుంది కానీ గర్భాశయ పొర విచ్చిన్నం కావడం వల్ల కాదు.

టాప్ హెడ్ లైన్స్

Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget