నెలసరి సమయానికి రావడం లేదని సూచించే లక్షణాలు ఇవే. కొంతమందికి ముందు లేదా లేటుగా పీరియడ్స్ వస్తుంటాయి. మరికొంతమందిలో బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలను తేలికగా తీసుకోవద్దు. నెలసరి సమయానికి రావడంలేదని తెలిపే లక్షణాలు చూద్దాం. సాధారణంగా పీరియడ్స్ కాలం రెండు నుంచి 7 రోజులు ఉంటుంది. 21 నుంచి 35 రోజుల మధ్య వస్తుంది. మీకు తక్కువ కాలంలో పీరియడ్స్ వస్తుందంటే అసాధారణంగా పరిగణించాలి. ఒక్కోసారి బ్లీడింగ్ అవ్వడం మామూలే. కానీ ప్రతినెలా అలాగే వస్తుంటే..ఇది పీసీఓఎస్ గా పరిగణించాలి. హార్మోన్ల అసమతుల్యత, మెనోరాగియా ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్ల వల్ల సంభవించవచ్చు. గర్భవతి లేదా నర్సింగ్, రుతివిరతిలో ఉంటే తప్పా 90 రోజుల కంటే ఎక్కువగా ఆగిపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. రుతుక్రమంలో రక్తం గడ్డకట్టడం సాధారణమే. అవి పెద్దవిగా , ముదురు రంగులో ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. పీరియడ్స్ సమయంలో నొప్పి ఉంటే..ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, హార్మోన్ల అసమతుల్యత వల్ల ఇలా జరుగుతుంది.