ఈ ఫుడ్స్‌తో విటమిన్-A లోపానికి గుడ్ బై చెప్పేయండి. మన శరీరానికి విటమిన్ A చాలా ముఖ్యం. విటమిన్ A లోపం లేకుండా ప్రతిరోజూ తినాల్సిన ఫుడ్స్ ఏవో చూద్దాం. మన కళ్లు, ఇమ్యూనిటి, పునరుత్పత్తి వ్యవస్ధ, సెల్యూలార్ కమ్యూనికేషన్ పనితీరుకు విటమిన్ A ముఖ్యమైంది. కాలే, బచ్చలికూర, బ్రోకలీ, బెల్ పెప్పర్స్ వంటి గ్రీన్ కలర్ కూరగాయల్లో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. ఎరుపు, నారింజ, పసుపు రంగు కూరగాయలు, పండ్లలో విటమిన్ A అధిక మోతాదులో ఉంటుంది. టమోటాలు, క్యారెట్లు, బీట్ రూట్, గుమ్మడికాయ, చిలగడదుంపలు, స్క్వాష్ లలో బీటా కెరోటిన్ అనే పోషకం ఉంటుంది. నారింజ, మామిడి, సీతాఫలం, బొప్పాయి, డ్రై ఆప్రికాట్లు వంటి పండ్లలోనూ విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. పాలు, పెరుగు, గుడ్లు వంటి పాల ఉత్పత్తుల్లోనూ విటమిన్ A ఉంటుంది. వీటిని నిత్యం ఆహారంలో చేర్చుకోవాలి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.