వడదెబ్బ లక్షణాలు - ఇలా జరిగితే ప్రాణాలకే ముప్పు ఎండలు పెరుగుతున్నాయ్.. వడదెబ్బకు ప్రాణాలు పోతాయ్. కాబట్టి, జాగ్రత్త. వడ దెబ్బ వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోయి.. స్పృహ తప్పుతారు. తలనొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే తప్పకుండా అప్రమత్తం కావాలి. వడదెబ్బ తీవ్రత ఎక్కువగా ఉంటే విరేచనాలు, వాంతులు అవుతాయి. మీ శరీర ఉష్ణోగ్రత సైతం పెరుగుతుంది. శరీరం వేడెక్కడం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దాహం ఎక్కువగా వేస్తుంది. కొందరికి తలతిరిగినట్లు అవుతుంది. కొందరైతే మతి తప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. మైండ్ గందరగోళంగా ఉంటుంది. ఈ లక్షణాలు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. ప్రాణాలు పోతాయ్. Images Credit: Pexels and Pixabay