Image Source: pexels

ఈ లక్షణాలు ఉంటే కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే

కిడ్నీలు బాగుంటేనే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీ సమస్యలు ఉన్నట్లు అర్థం.

అలసట ఎక్కువగా ఉంటున్నట్లయితే కిడ్నీల పనితీరులో సమస్య ఉన్నట్లు సూచిస్తుంది.

పార్శ్వ ప్రాంతంలో నొప్పి ఉంటే కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్లను సూచిస్తుంది.

ఆకలి తగ్గిపోవడం కూడా కిడ్నీ సమస్యలకు సంకేతం. ఆకలిని ప్రేరేపించే హార్మోన్ల ఉత్పత్తిని కిడ్నీలు ప్రభావితం చేస్తాయి.

వికారం లేదా వాంతులు ఎక్కువగా ఉంటున్నట్లయితే కిడ్నీలు బలహీనంగా ఉన్నాయని అర్థం.

నిద్రలేవగానే కళ్ల చుట్టూ వాపు కనిపిస్తున్నా కిడ్నీల సమస్యగా గుర్తించాలి.

చీలమండల చుట్టూ వాపు ఉన్నా సరే కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని అర్థం.

నడుస్తున్నప్పుడు ఊపిరి తీసుకోడానికి ఇబ్బంది పడుతున్నారా? ఇది కూడా కిడ్నీ సమస్యే.

శరీరమంతా దురద బలహీనమైన మూత్రపిండాల పనితీరుకు సంకేతం.

మూత్రవిసర్జన తగ్గడం, మూత్రంలో నురుగు లేదా బుడగలు ఉంటే ప్రొటీన్యూరియాకు సంకేతం.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.