ఉపవాసంతో ఆధ్యాత్మికత ప్రయోజనాలే కాదు, హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. ఉపవాసం వల్ల శరీరంలోని విషతుల్యాలన్నీ బయటకు పోతాయి. జీర్ణవ్యవస్థకు ఉపవాసంతో విశ్రాంతి దొరుకుతుంది. జీవక్రియ వేగవంతంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం ఉపవాసంతో వాత, పిత్త, కఫాలు దోషాలు తొలగిపోతాయి. ఉపవాసం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఉపవాస స్థితిలో శరీరక శ్రమ లేకుండా ధ్యానం చేస్తే ఆరోగ్యానికి మరింత మేలు. పండుగల సమయంలోనే కాకుండా.. వారంలో ఒకసారి ఉపవాసం చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే.