పనసపండు.. ఎన్నో పోషకాలు కలిగి ఉంటుంది. అయితే, పండేకాదు ఆకులు కూడా ఎంతో మేలు చేస్తాయి.

పనసకాయ ఆకులు ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడతాయని చాలా అధ్యయనాలు పేర్కొన్నాయి.

పనసకాయ ఆకులను పొడి చేసి తీసుకుంటే శరీరానికి పోషకాలు అందుతాయి. షుగర్‌ తగ్గుతుంది.

పనసకాయ పొడి వల్ల షుగర్‌ తగ్గుతుందని 2020లోనే అమెరికా చేసిన రిసర్చ్‌లో తేలింది. కార్బొహైడ్రేట్స్‌ తక్కువగా ఉంటాయి.

దోశ, ఇడ్లీ, చపాతీ, వంటకం ఏదైనా దాంట్లో ఒక స్పూన్‌ పనసపొడి వేసుకుంటే చాలు.. షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది.

మజ్జిగ, నీటిలో కూడా కలుపుకుని తాగొచ్చు. ఫైబర్‌ ఎక్కువగా ఉండటం, విటమిన్‌ సీ వల్ల వెయిట్‌ లాస్‌ అవుతారు.

పనసపండు తినడం వల్ల కూడా శరీరానికి పోషకాలు బాగా అందుతాయి. దాంట్లో విటమిన్‌ ఏ, సీ, బీలు ఉంటాయి.

గుండెకి మంచి చేస్తుంది. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. అరుగుదలకి, కంటిచూపుకి చాలా మంచిది.

పనసపండు తినడం వల్ల ఫైబర్‌ పుష్కలంగా అందుతుంది. దాంట్లో ఉండే ఆక్సిడేటివ్‌ ప్రాపర్టీస్‌ మంచి చేస్తాయి. చర్మవ్యాధులు కూడా రావు.

Image Source: Pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.