పెరుగు తింటే ఇన్ని ప్రయోజనాలా? పాలను పులియబెడితే పెరుగుగా మారుతుంది. ఇది సూపర్ ఫుడ్. పెరుగు క్రమం తప్పకుండా తింటే ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పెరుగు రోజు తింటే ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పెరుగులో ఉండే ప్రొబయోటిక్స్ జీర్ణక్రియ ప్రక్రియలో మ్యాజిక్ లా పనిచేస్తుంది. బలబద్దకం, అతిసారం తగ్గిస్తుంది. పెరుగు రోగనిరోధకశక్తిని పెంచుతుంది. పెరుగులో ఉండే పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. పెరుగులో ఉండే ప్రొటీన్, విటమిన్ కంటెంట్ మంచి జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఎన్నో పోషకాలు ఉన్న పెరుగు శక్తిని అందిస్తుంది. వ్యాయామానికి ముందు తింటే శక్తి లభిస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.