థైరాయిడ్ గ్రంథి ఎక్కువ లేదా తక్కువ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తే దానిని థైరాయిడ్ వ్యాధి అంటారు. హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం, థైరాయిడిటిస్, హషిమోటోస్ థైరాయిడిటిస్ వంటి థైరాయిడ్ వ్యాధులు ఉన్నాయి. థైరాయిడ్ ప్రారంభంలో గ్రంధిలో తేలికపాటి నుంచి తీవ్రమైన నొప్పిగా మారుతుంది. థైరాయిడ్ గ్రంధి తాకినప్పుడు సున్నితంగా అనిపిస్తుంది. కానీ కాలనుగుణంగా శరీర భాగాల్లోకి నొప్పి వ్యాపిస్తుంది. మీకు థైరాయిడ్ ఉన్నట్లయితే ఏదైనా మింగేటప్పుడు లేదా తినేటప్పుడు, తాగేటప్పుడు నొప్పిగా అనిపిస్తుంది. తలతిప్పుతుంటే కూడా నొప్పి, అసౌకర్యంగా ఉంటుంది. కొన్నిసార్లు చెంపల చుట్టూ నొప్పి ఉన్నట్లు అనిపిస్తుంది. గవదబిళ్ళలో ఏర్పడుతుంది. థైరాయిడ్ ప్రారంభంలో చేతుల్లో తిమ్మిరి ఉంటుంది. మీ కాళ్ల కండరాలు, కీళ్లలో నొప్పి కూడా ఉంటుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.