రోజూ మనం తీసుకునే ఆహారంలో చిరుధాన్యాలను చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



సజ్జలు, రాగులు, జొన్నలు, సామలు, కొర్రలు, అండుకొర్రలు మనదేశంలో ఎక్కువగా లభ్యమవుతున్నాయి.



మిల్లెట్లు బరువు, BMI మరియు అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.



మిల్లెట్లు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. కనుక షుగరు వ్యాధిని కంట్రోల్‌ చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.



శరీరానికి అనుకూలమైన పోషకాలను అందించడంలో ఇవి సహాయపడతాయి అందుకే వీటిని సూసర్‌ ఫుడ్‌ అని కూడా పిలుస్తారు.



మిల్లెట్లు మంచి కొవ్వులను కలిగి ఉంటాయి. వీటితో పాటు ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి.



మిల్లెట్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హార్ట్‌ ప్రాబ్లమ్స్‌ వచ్చే రేషియో తగ్గుతుందని నిపుణుల సూచన.



చిరుధాన్యాలను అల్పాహారంగా గానీ, లంచ్, డిన్నర్, స్నాక్స్‌ లో ఎలాగైనా తీసుకోవచ్చంటున్నారు ఆహార నిపుణులు.



మన దేశంలో దాదాపు 300 రకాల మిల్లెట్‌లు ఉన్నాయి. తక్కువ నీటితో సాగయ్యే వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి.



ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలను ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.