వయాగ్రా.. ఈ పేరు అనగానే మనల్ని అదోలా చూస్తుంటారు. దాని నేపథ్యం అంటువంటిది. పరిశోధనల్లో నవజాత శిశువుల్లో వచ్చే ఆక్సిజన్ అందని పరిస్థితిని వయగ్రా సక్రమంగా చేసి ప్రాణాలను కాపాడుతుందని తేలింది. భవిష్యత్తులో ఇది చిన్నారులకు ప్రాణదాత అవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. గర్భదారణ సమయంలో ఆక్సిజన్ అందక.. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే శిశువులకు సహాయపడుతుంది. సిల్డెనాఫిల్ ట్యాబ్లెట్ ఇందుకు బాగా ఉపయోగపడుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. నవజాత శిశువుల్లో కనిపించే ఈ పరిస్థితిని నియోనాటల్ ఎన్సెఫలోపతి అని పిలుస్తారు. మాంట్రియల్ చిల్డ్రన్స్ ఆసుపత్రిలో చేసిన క్లినికల్ అధ్యయనం మొదటి దశలో ఈ విషయాలను తెలుసుకున్నారు. వయాగ్రా వాడకం వల్ల నియోనాటల్ ఎన్సెఫలోపతి వల్ల మెదడు దెబ్బతినే సంకేతాలను సరిచేయడానికి సహాయపడుతుంది. ఈ అద్భుతమైన ఫలితంలో ఎంతో మంది చిన్నారుల పాలిట వరంగా మారే ఛాన్స్ ఉంది. డాక్టర్ సూచించకుండా వాడితే పిల్లల ప్రాణాలకే ప్రమాదం. (పూర్తి కథనం కోసం మా లైఫ్ స్టైల్ పేజ్ చూడండి)