మన శరీరానికి కావాల్సిన ఫుడ్ అందడం లేదని తెలిపే కొన్ని సంకేతాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. క్రానిక్ ఫెటీగ్ అనేది మీరు కావాల్సినంత ఆహారం తీసుకోనప్పుడు కనిపించే లక్షణం. తక్కువ కేలరీలు తీసుకోవడం, పోషకాహార లోపం వల్ల జుట్టు రాలిపోతుంది. శరీరానికి కావాల్సినంత ఫుడ్ అందించనప్పుడు ఆకలి వేయడం స్పష్టమైన సంకేతం. పదే పదే ఆకలి వేయడమనేది మీరు సరిపడా ఆహారం తీసుకోవడం లేదని అర్థం. మలబద్దం, లేదా ప్రేగు వ్యాధులు కూడా మీరు సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్లే వస్తాయి. ఆరోగ్యకరమైన శరీర ఉష్ణోగ్రత నిర్వహించేందుకు క్యాలరీలు బర్న్ కావాలి. కావాల్సిన ఫుడ్ అందించనప్పుడు చిరాకు, కోపం వస్తాయి. మూడీగా ఉంటారు. తక్కువ కేలరీలు తీసుకుంటే ఆందోళన మొదలవుతుంది. జుట్టుపల్చబడటం, ముఖంపై మొటిమలు, బలహీనమైన గోళ్లు.. ఇవన్నీ దీని లక్షణాలే. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.