పుట్టుకతో వచ్చే గుండె సమస్యలను కంజెనిటల్ హార్ట్ డిజీజెస్ అంటారు.

పిల్లల్లో ఈ సమస్యలను పుట్టుకకు ముందే కూడా కనిపెట్టవచ్చు. చాలా సందర్భాల్లో బాల్యంలోనే గుర్తిస్తారు.

ఈ సమస్య ఉన్న పిల్లల్లో సమస్య తీవ్రతను బట్టి లక్షణాలు కూడా ఒకొక్కరిలో ఒకో విధంగా ఉంటాయి.

చర్మం, పెదవులు నీలంగా మారుతాయి. దీనిని సైనోసిస్ అంటారు. రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల ఇలా జరుగుతుంది.

పిల్లలు చాలా వేగంగా ఊపిరి తీసుకుంటారు. ముఖ్యంగా ఏదైనా ఆటలో లేదా పనిలో ఉన్నపుడు .

కంజెజనిటల్ హార్ట్ డసీజ్ లో పిల్లలు చాలా నీరసంగా, బలహీనంగా కనిపిస్తారు.

చాలా ఎక్కువ చెమట పడుతుంటుంది. ముఖ్యంగా ఆటలో ఉన్నపుడు, ఆహారం తసుకున్న తర్వాత. ఇది గుండె సామర్థ్యం తగ్గిందనేందుకు సూచన.

గుండె సామర్థ్యం తక్కువగా ఉండడం వల్ల శిశువులు పాలు సరిగ్గా తాగలేరు. ఫలితంగా ఎదుగుదల సరిగ్గా ఉండదు.

తరచుగా శ్వాస సంబంధ సమస్యలు రావడం, నిరంతరం దగ్గు రావడం వంటివి గుండె బలహీనతను తెలియజేసే లక్షణాలు.



ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels