ఆకలి తగ్గించి కడుపును ఫుల్ గా ఉంచే సూపర్ ఫుడ్స్ ఆకలిని తగ్గించి..కడుపు నిండిన అనుభూతిని కలిగించడంలో సహాయపడే ఆహారాలేవో చూద్దాం. వోట్స్ లో ఫైబర్, కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ఎక్కువ కాలం కడుపును నిండుగా ఉంచుతుంది. స్వీట్ పొటాటోల్లో ఫైబర్, కార్బొహైడ్రేట్స్ కు మంచి మూలం. విటమిన్ ఎ, పొటాషియం అధికంగా ఉంటాయి. బీన్స్, కాయధాన్యాలు, చిక్ పీస్ వంటి వాటిలో ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అవోకాడోల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, మోనోఅన్ శాచురేటెడ్ కొవ్వులతో నిండి ఉంటుంది. కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, ఫైబర్ ఉంటుంది. ఆకలిని అరికట్టడంతో సహాయపడతాయి. (గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి)