ఉదయం గ్లాసు వేడి నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే వేడినీరు శరీరంలో నుంచి విషతుల్యాలను తొలగిస్తుంది. రక్త ప్రసరణను పెంచుతుంది. ఉదయాన్నే వేడినీళ్లు తాగితే జీర్ణక్రియ ప్రక్రియకు సహాయపడుతుంది. పోషకాలను మరింత గ్రహించేలా చేస్తాయి. వేడినీరు జీవక్రియను పెంచుతాయి. బరువు తగ్గాలనుకునేవారు వేడినీళ్లు తాగాలి. ఉదయాన్నే వేడినీళ్లు తాగితే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ముక్కు మూసుకుపోకుండా సహాయపడుతుంది. అలెర్జీలకు చెక్ పెడుతుంది. గోరువెచ్చని నీటిని తాగితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వేడినీరు తాగితే ఒత్తిడి తగ్గుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వేడి నీటి వెచ్చదనం రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. కండరాలను సడలిస్తుంది. గోరువెచ్చని నీటితో నోరు కడుక్కుంటే బాక్టీరియా, ఫలకాన్ని తొలగించి, నోటి పరిశుభ్రతను ప్రోత్సహిస్తుంది. (గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి)