చాక్లెట్స్ అంటే చాలా మందికి ఇష్టం. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటుంటారు. చాక్లెట్స్ అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాక్లెట్స్ లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని అతిగా తింటే బరువు పెరుగుతారు. చాక్లెట్స్ లో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది దంతక్షయం, కావిటీలకు దారితీస్తుంది. అధిక చక్కెర కారణంగా ముఖంపై మొటిమలు ఏర్పడతాయి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్లలో మరింత ఎక్కువగా ఉంటుంది. ఇందులోని కెఫిన్, థియోబ్రోమిన్ జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. అతిగా తింటే వికారం, వాంతులు, విరేచనాలు అవుతాయి. చాక్లెట్స్ మితంగా తీసుకుంటే.. అందులోని యాంటీఆక్సిడెంట్ గుండెను కాపాడతాయి. మోతాదు మించితే మాత్రం.. గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. (గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి)