దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల శరీరంగా ఆరోగ్యంగా, హైడ్రేటెడ్ గా ఉంటుంది. కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించడంలో దానిమ్మ సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దానిమ్మలో డైటరీ ఫైబర్స్ ఉన్నాయి. మెరుగైన జీర్ణక్రియకు సహాయపడతాయి. ఇమ్యూనిటీని పెంపొందించడానికి దానిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంది. దానిమ్మలో మంచి మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. దానిమ్మ జ్యూస్ తాగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గించి రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఉదయం లేదా మధ్యాహ్నం లేదా సాయంత్రం దానిమ్మ జ్యూస్ ను తాగవచ్చు. క్రమం తప్పకుండా దానిమ్మ జ్యూస్ తీసుకుంటే పొట్ట శుభ్రంగా ఉంటుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. అయితే, డాక్టర్ సలహా తీసుకొనే ఇది తీసుకోవాలి.