మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందించాలి. మన శరీరానికి కావాల్సిన మిటమిన్లు, మినరల్స్ సరిగ్గా అందిస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. ఏ విటమిన్ లోపిస్తే ఎలాంటి వ్యాధులు ఇబ్బంది పెడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ సి లోపిస్తే స్వర్వీ, అలసట, చిగుళ్లవాపు, రక్తస్రావం, కీళ్లనొప్పులు వంటి వ్యాధులు తప్పవు. విటమిన్ డి, కాల్షియం లేనట్లయితే రికెట్స్ వ్యాధి ఇబ్బంది పెడుతుంది. ఎముకలు బలహీనంగా మారుతాయి. ఐరన్ లోపిస్తే రక్తహీనత ఏర్పడుతుంది. అలసట, బలహీనత, చర్మం సమస్యలు వేధిస్తాయి. మిటమిన్ బి1లోపం కండరాలు బలహీనంగా, నరాలు దెబ్బతినడం, గుండె సమస్యలు వస్తాయి. విటమిన్ A లోపం రేచీకటికి దారితీస్తుంది. చూపు బలహీనమవుతుంది. కాల్షియం, విటమిన్ డి లోపం.. బోలు ఎముకల వ్యాధికి కారణం అవుతుంది.