మనిషి ఆరోగ్యంగా ఉండేందు విటమిన్స్, మినరల్స్ తో పాటు సరైన నిద్ర ఉండాలి. ఈ రోజుల్లో కొన్ని కారణాల వల్ల.. సరిగ్గా నిద్రపట్టని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. స్ట్రెస్, ఆలోచనలు కారణాలు ఏవైనా నిద్ర పోకపోతే.. ఆరోగ్యం దెబ్బతింటుంది. కంటి నిండా నిద్ర ఉండాలంటే.. పడుకునేముందు ఈ పనులు అస్సలు చేయకూడదు. బ్లూ లైట్ స్లీప్ సైకిల్ ని పాడుచేస్తుంది. అందుకే పడుకునే ముందు గ్యాడ్జెట్స్ వాడకూడదు. పడుకునే ముందు ఎక్సర్ సైజ్ చేయకూడదు. హార్ట్ రేట్, ఆడ్రినలైన్ లెవెల్స్ పెరిగి నిద్రపట్టదు. కాఫీ, టీ, ఆల్కహాల్ లాంటి వాటిల్లో ఉండే కెఫీన్ నిద్రపట్టనివ్వదు. అందుకే, రాత్రిళ్లు తాగకూడదు. పడుకునే ముందు మైండ్ ఫ్రెష్ గా ఉంచుకోవాలి. నచ్చని విషయాలను మాట్లాడొద్దు. ఎక్కువ నీళ్లు తాగకూడదు. పదే పదే వాష్ రూమ్‌కు లేవడం వల్ల నిద్ర పాడవుతుంది. జంక్ ఫుడ్ అస్సలు తినకూడదు. దానివల్ల అజీర్ణం ఏర్పడి నిద్ర పట్టదు. (Image Credits: Pexels)