ఆల్జీమర్స్ వయసు పెరిగే కొద్దీ మెదడులో క్షీణత వల్ల వస్తుంది. మెదడులో కణాలు దెబ్బతిని చిత్తవైకల్యం కలుగుతుంది. కుటుంబంలో ఎవరికైనా ఆల్జీమర్స్ వ్యాధి ఉన్నట్లయితే మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ వయసు 40 దాటిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ పెరగదు. ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ పెరగదు. కొలెస్ట్రాల్ మెదడులో న్యూరాన్లను అడ్డుకుంటుంది. మీ డైట్‌లో డ్రై ఫ్రూట్స్, ఫిష్, బ్రౌన్ రైస్, ఓట్స్ ఉండాలి. 40 సంవత్సరాల వయసు దాటిన వారు వ్యాయామం చేస్తే ఆల్జీమర్స్ వ్యాధి బారిన పడకుంటా ఉంటారు. పని ఒత్తిడిలో పడి నిద్ర గురించి అజాగ్రత్త చేయవద్దు. ఇది మీ మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. 40 దాటిన తర్వాత పిల్లల ఎదుగుదల మీద దృష్టి పెట్టాలి. మీరు మానసికంగా కూడా దృఢంగా మారుతారు. మెదడుకు వ్యాయామం అంటే శారీరక వ్యాయామం లాంటిది కాదు. ఆలోచనకు పదులు పెట్టాలి. మీ మెదడు సరిగ్గా పని చేయాలంటే గుండె ఆరోగ్యంగా ఉండాలి. రక్త పోటు, మధుమేహం వంటి సమస్యలను ముందుగా గుర్తించి మందులు వాడాలి.