అల్పాహారం తినకపోతే క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుందట ! క్యాన్సర్ కాకుండా ఇంకా చాలా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. రోజూ అల్పాహారం తినకపోతే టైప్-2 డయాబెటీస్ ప్రమాదం ఉంది. పొద్దున్న ఏమీ తినకపోతే సాయంత్రం లేదా రాత్రి సమయంలో అతిగా తినే అవకాశం ఉంది. దానివల్ల క్యాలరీలు ఎక్కువగా పొంది బరువు పెరుగుతారు. ఈ విధంగా బరువు పెరిగినవారికి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు స్థాయిని పెంచడం, తలనొప్పి, మైగ్రేన్, జుట్టు రాలడం వంటివి జరుగుతాయి. అల్పాహారం తిననివారికి గుండెపోటు వచ్చే అవకాశాలు 27% ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన అల్పాహారంతో మీ రోజును ప్రారంభించడం వలన మీరు రోజంతా చురుకుగా ఉంటారు.