ఈ రోజుల్లో నిద్ర పట్టకపోవడం చాలామందిలో కనిపిస్తున్న సమస్య. నిద్ర సరిగ్గా లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే, కంటినిండా నిద్రపోవాలని సూచిస్తారు డాక్టర్లు. చక్కగా నిద్ర పట్టాలంటే ఐదు రకాల పండ్లు సహకరిస్తాయట. చెర్రీ పండ్లలో ఉండే మెలటోనిన్ నిద్ర పట్టేందుకు, మెలుకువ వచ్చేందుకు, నిద్రపోయేందుకు ఉపయోగపడుతుంది. అరటిపండ్లలో ఉండే నైట్రైట్స్ వల్ల రక్తకణాలు విస్తరిస్తాయి. దాంతో రక్త ప్రసరణ బాగా జరిగి నిద్ర పట్టేందుకు సహాయపడుతుంది. పాలకూర, కాలే, కీరదోశ జ్యూస్ తాగితే నిద్రబాగా పడుతుంది. మినరల్స్, యాంటి ఆక్సిడెంట్స్ గుండెను పదిలంగా ఉంచుతాయి. కివీలో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్స్, సెర్టోనిన్ ఉంటాయి. పడుకునే ముందు కివీ తింటే బాగా నిద్రపడుతుంది. పైనాపిల్‌లో ఉండే బ్రొమిలైన్ అనే ఎంజైమ్.. కండరాలను ఫ్రీ చేస్తుంది. దీంతో బాడీ రిలాక్స్ అవుతుంది. హాయిగా నిద్రపడుతుంది. నారింజలో విటమిన్ C ఉంటుంది. ఇవి స్ట్రెస్‌ను తగ్గించి హాయిగా నిద్రపట్టేలా చేస్తాయి.