ఫ్యాటీ లివర్ సమస్యను కొద్దిపాటి జాగ్రత్తలతో నివారించవచ్చు.

శరీర బరువు అదుపులో ఉంచుకోవాలి. మోతాదుకు మించి బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి.

ఆహారంలో ఎక్కవ మొత్తంలో పండ్లు, కూరగాయలు, ధాన్యాలు ఉండేలా జాగ్రత్త పడాలి.

ఎక్కవ క్యాలరీలు కలిగిన ముఖ్యంగా సంతృప్తకొవ్వులు కలిగిన ఆహారం నుంచి దూరంగా ఉండాలి.

ఆల్కాహాల్ అలవాటును అదుపులో ఉంచుకోవాలి. అది ఫ్యాటీ లివర్ సమస్యకు ప్రత్యక్ష కారణం కావచ్చు.

సెడంటరీ లైఫ్ స్టయిల్‌కు దూరంగా ఉండాలి. ఎక్కువ సమయం కూర్చుని ఉండడం మంచిది కాదు.

ప్రీడయాబెటిక్ లేదా డయాబెటిక్ స్థాయిలో ఉన్నా సరే తప్పకుండా షుగర్ స్థాయిలు అదుపులో పెట్టుకోవాలి.

డయాబెటిస్ విషయంలో డాక్టర్ సూచించిన అన్ని అంశాలను తప్పక పాటించాలి.

బరువు ఎక్కవగా ఉంటే క్రమంగా తగ్గేట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అకస్మాత్తుగా బరువు తగ్గకూడదు. ఇది ఫ్యాటీ లివర్ కు కారణం కావచ్చు.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels