నెయ్యి ఆరోగ్యానికి మంచిదే. మరి, పరగడుపున తింటే? డోన్ట్ వర్రీ, అది మంచి అలవాటే. నెయ్యిలో సంత్రుప్త కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. నెయ్యిలో A, E, D విటమిన్లు ఉన్నాయి. ఇమ్యూనిటీ వ్యవస్థ, చర్మ ఆరోగ్యం, ఎముకలు బలాన్ని ఇస్తాయి. నెయ్యిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గిస్తాయి. తక్కువ గ్లైసెమిక్ సూచికతో నెయ్యి రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. నెయ్యి బ్యూట్రిక్ యాసిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. గట్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొవ్వులో కరిగే పోషకాలను గ్రహించడానికి నెయ్యి సహాయపడుతుంది. కీళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. నెయ్యి పేగు లైనింగ్ ను పోషించడం, గట్ బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడటం ద్వారా జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. నెయ్యిలో అధిక కేలరీ కంటెంట్ ఉంది. మితంగా తీసుకుంటే మంచిది. గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.