మొలకలు ఆరోగ్యానికి ఎంతోమంచిది. వెయిట్ లాస్‌కు కూడా బాగా ఉపయోగపడతాయి. మొలకెత్తిన పెసలు కూడా శరీరానికి మంచి చేస్తాయి. దాంట్లో పోషకాలు అధికంగా ఉంటాయి. మొలకెత్తిన పెసలను తింటే ఎన్నో లాభాలు.. అవేంటో చూద్దాం. పెసల్లో విటమిన్స్ సీ, కే, బి ఉంటాయి. ప్రొటీన్స్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం లాంటి మినరల్స్ ఉంటాయి. జీర్ణం అయ్యేందుకు ఉపయోగపడే ఎంజైమ్స్ ఉంటాయి మొలకెత్తిన పెసల్లో. డైటరీ ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది. పెసల్లో ఉండే విటమిన్ - సీ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. మొలకెత్తిన పెసల్లో క్యాలరీలు, కొవ్వు తక్కువగా ఉంటుంది. పోషకాలు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి దీంతో బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి. ఇవి తింటే గుండెకు మంచిది. బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా అవుతుంది. మొలకెత్తిన పెసల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.