శ‌రీరానికి ప్రొటీన్ చాలా అవ‌స‌రం. శ‌రీరంలో ప్ర‌తి క‌ణంలో ఉంటుంది. కీల‌క పాత్ర పోషిస్తుంది.

మ‌జిల్స్ ఆరోగ్యంగా ఉంటాయి. ఎముక‌ల‌ను బ‌లంగా చేస్తుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది.

Image Source: pixabay

జీర్ణం అయ్యేందుకు ఉప‌యోగ‌ప‌డే ఎంజైమ్, హార్మోన్ల‌ను రిలీజ్ అయ్యేందుకు ప్రొటీన్ అవ‌స‌రం.

శ‌రీరానికి ప్రొటీన్ అందాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. మ‌రి ఏం తింటే ప్రొటీన్ అందుతుంది.

శ‌న‌గలు, బ్లాక్ బీన్స్, రాజ్మా లాంటి వాటిల్లో ప్రొటీన్, ఫైబ‌ర్ ఉంటుంది. వీటిని సూప్, స‌లాడ్ గా తీసుకోవ‌చ్చు.

గ్రీక్ యోగర్ట్ లో ప్రొటీన్, కాల్షియం బాగా ఎక్కువ‌గా ఉంటుంది. దీన్ని ప్లెయిన్ గా, ఫ్రూట్స్ తో, సాస్ గా లేదా డిప్స్ తో తిన‌వ‌చ్చు.

రోజుకి ఒక ఎగ్ తింటే మంచిద‌ని చెప్తారు. దాంట్లో ప్రొటీన్స్ తో పాటు విట‌మిన్స్, మిన‌ర‌ల్స్, ఫ్యాట్స్ ఎక్కువ‌గా ఉంటాయి.

సాల్మ‌న్, ట్యూనా, సార్డెన్ జాతి చేప‌ల్లో ప్రొటీన్ ఎక్కువ‌గా ఉంటుంది. వారానికి 2 - 3 సార్లు తింటే.. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కూడా అందుతాయి.

అన్ని గింజ‌లు, విత్త‌నాల్లో పోష‌కాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి. ప్రొటీన్, హెల్దీ ఫ్యాట్స్, ఫైబ‌ర్ ఉంటుంది.

Image Source: Pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.