ఈ రోజుల్లో నైట్ కల్చర్ పెరిగిపోయింది. నైట్ రైడ్స్, లేట్ నైడ్ ఫుడ్ తినడం అలవాటు అయిపోయింది. అలా లేట్ నైట్ ఫుడ్ తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్తున్నారు డాక్టర్లు. లేట్ నైట్ ఫుడ్ తినడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. సాయంకాలం, రాత్రి పూట పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. డయాబెటిస్ రావచ్చు. రాత్రి లేట్ గా తినడం వల్ల అధికంగా బరువు పెరుగుతారు. బెల్లీ ఫ్యాట్ కూడా పెరిగిపోతుంది. నైట్ ఎక్కువగా పిజ్జా, బర్గర్ లాంటివి తింటారు. టీవీ చూస్తూ ఎక్కువగా తినేస్తారు. దానివల్ల ఇబ్బందులు కలుగుతాయి. నైట్ తినేందుకు లేవడం, హెవీగా తినేసి పడుకోవడం వల్ల నిద్ర దెబ్బతింటుంది. లేట్ నైట్ ఫుడ్ తినేవాళ్లలో డిప్రషన్, యాంగ్జైటీ పెరిగిపోతుంది. మెంటల్ కండిషన్ కూడా సరిగ్గా ఉండదు. లేట్ నైట్ తినేవాళ్లలో బ్యాడ్ మూడ్ ఉంటుంది. ఒక్కోసారి జీవితం మీద విరక్తి కలిగిన ఫీలింగ్ వస్తుందని స్టడీస్ చెప్తున్నాయి. లేట్ నైట్ స్నాక్స్ ఎక్కువగా తినడం వల్ల గుండెజబ్బులు వస్తాయి. బీపీ కూడా పెరిగే అవకాశం ఉంది.