కొన్ని చిన్న చిన్న సూచనలే ఫ్యాటీ లివర్ సమస్యను సూచిస్తాయి. నిర్లక్ష్యం కూడదని నిపుణులు చెబుతున్నారు.

లివర్ లో కొవ్వు కణాలు చేరడాన్ని ఫ్యాటీ లివర్ లేదా హెపాటిక్ స్టియాటోసిస్ అంటారు.

ఇది చాలా సులభంగా జయించగలిగే సమస్య. కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం చాలా తీవ్రమైన అనారోగ్యానికి కారణం కావచ్చు.

నిరంతరం నీరసంగా ఉండడం. నీరసానికి పెద్దగా కారణాలు తెలియకపోవడం. విశ్రాంతి తర్వాత కూడా పెద్ద ప్రయోజనం లేకపోవడం

కడుపులో అసౌకర్యంగా ఉండడం. తరచుగా కడుపునొప్పి వస్తుంటుంది. లివర్ లో ఇన్ఫ్లమేషన్ వల్ల ఇలా జరుగుతుంది.

ఎలాంటి కారణం లేకుండా బరువు పెరుగుతుంటారు. లైఫ్ స్టయిల్ లో మార్పు లేకపోయినప్పటికి బరువు పెరిగిపోతుంటారు.

చర్మం మీద దురదలు రావడం, దద్దుర్లు రావడం, కళ్లు తెల్లగుడ్డు పచ్చగా మారడం లివర్ అనారోగ్య సూచనలు.

లివర్ బైలురుబిన్ ప్రాసెసింగ్ చెయ్యడంలో విఫలమైతే అది మూత్రంలో చేరి మూత్రం రంగు ముదురుగా మారుతుంది.

కాళ్లు, పాదాల్లో వాపు రావడం. లివర్ పనితీరు సరిగ్గా లేకపోతే శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ తప్పుతుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!