చిన్నగా కనిపించే లవంగంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, విటమిన్ E, విటమిన్ C, విటమిన్ A, ఒమేగా 3 వంటి పోషకాలు ఉన్నాయి. లవంగాలను ఎప్పుడైనా తినొచ్చు. కానీ నిద్రించే ముందు తింటే రెట్టింపు ప్రయోజనాలను పొందుతారు. రాత్రిపూట లవంగం తింటే మలబద్దకం, అసిడిటి, కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. తలనొప్పి సమస్య నుంచి బయటపడాలంటే రాత్రి పడుకునేముందు 2 లవంగాలను గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగాలి. లవంగాల్లో ఉండే యాంటీసెప్టిక్ లక్షణాలు నోటి దుర్వాసన, దంతక్షయం నుంచి ఉపశమనం అందిస్తుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉంటే ప్రతిరోజూ లవంగం తినండి. జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్, బ్రాంకైటిస్, సైనస్, ఆస్తమా వంటి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.