పులియబెట్టిన ఆహారపదార్థాల్లో మేలు కలిగించే బాక్టీరియా, ఈస్ట్ ఉంటాయి సరైన పద్ధతిలో పులియబెట్టిన ఆహారాన్ని తీసుకుంటే ఇవి ఎంతో ఆరోగ్యాన్నిస్తాయి పులియబెట్టిన ఆహారంలో ప్రోబయాటిక్స్ ఉంటాయి. ఇవి మంచి బాక్టీరియాను పెంచి, చెడు బాక్టీరియాను అదుపులో ఉంచుతాయి. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఈ ఆహారం ఉపయోగకరంగా ఉంటుంది శరీరానికి కావల్సిన విటమిన్స్, మినరల్స్ అందించటానికి పులియబెట్టిన ఆహారం ఉపకరిస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది పులియబెట్టిన పదార్థాల్లో ఉండే బయోఆక్టివ్ కాంపౌండ్లు, శరీరంలో వాపును తగ్గించే లక్షణాలు కలిగి ఉంటాయి. పులియబెట్టిన పదార్థమైన పెరుగులో ఉండే బాక్టీరియా, లాక్టోస్ ను విడగొడుతుంది. ఇది అరుగుదలను పెంచుతుంది.