Early Age of Menstruation Causes : చిన్న వయసులోనే ఆడపిల్లలు పెద్దమనిషి అవ్వడానికి కారణాలు ఇవే.. ఆ ప్రమాదకర సమస్యలు తప్పవట
Early Period Age : ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది చిన్నవయసులోనే పెద్దమనిషి (పుష్పవతి) అవుతున్నారు. దానికి గల కారణాలు ఇవే అంటూ నిపుణులు చెప్తున్నారు.
Complications of the Early Menstrual Period : ఆడపిల్లల్లో మొదటి రుతుక్రమం (First Menstration)ను.. రజస్వల, పుష్పవతి, పెద్దమనిషి.. ఇలా వివిధ పేర్లతో వివిధ ప్రాంతాల్లో పిలుస్తారు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల్లో రజస్వల కూడా ఒకటి. ఎందుకంటే యుక్తవయసులో రావాల్సిన పీరియడ్స్.. దానికంటే ముందే వచ్చేస్తున్నాయి. గతంలో 15 సంవత్సరాల వయసులో అంటే యుక్తవయసులో తమ మొదటి రజస్వలను పొందేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. పదేళ్లు.. లేదా పదేళ్ల లోపు కూడా ఆడపిల్లలు తమ మొదటి పీరియడ్స్‌ను పొందుతున్నారు. ఎందుకంటే..
ప్రస్తుతకాలంలో బాలికలు తమ మొదటి పీరియడ్స్‌ను చాలా ముందుగానే పొందుతున్నారు. ముందుతరం వారితో పోలిస్తే.. ఈ పరిస్థితి చాలా దారణంగా మారిపోయింది. ముందుతరం వారికి.. ఇప్పటివారికి దాదాపు 5 సంవత్సరాల వ్యత్యాసం ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. యుక్తవయసు రాకమునుపే ఈ విషయంపై యూఎస్‌లో శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఈ స్టడీలో వారు షాకింగ్ విషయాలు గుర్తించారు.
ఐదేళ్లలోపు వారు కూడా అయిపోతున్నారట..
యూఎస్‌లోని బాలికలపై చేసిన ఈ స్టడీలో నిపుణులు కొన్ని విషయాలు గుర్తించారు. పిల్లలపై ఆర్థిక నేపథ్యం నుంచి దాదాపు ప్రతి అంశం వారిని ప్రభావితం చేస్తున్నట్లు గుర్తించారు. దీనిలో షాకింగ్ విషయం ఏమిటంటే.. కొందరిలో 5 సంవత్సరాల వయసులోపు వారు కూడా తమ రజస్వలను పొందుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పదేళ్ల లోపు రజస్వలకు అయ్యేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగినట్లు అధ్యయనంలో పేర్కొన్నారు. కేవలం ఆర్థిక అంశాలే కాకుండా.. శారీరక అంశాలు కూడా వారిపై ప్రభావం చూపిస్తున్నట్లు తెలిపారు.
అదే ప్రధానకారణమట..
అధిక బరువు, ఊబకాయం, శారీరక శ్రమ తక్కువగా ఉండడం కూడా బాలికల రజస్వలపై ప్రభావం చూపిస్తున్నాయని గుర్తించారు. అంతేకాకుంజా స్క్రీన్ సమయం కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు. స్క్రీన్‌ను ఎక్కువగా చూసే బాలికల్లో యుక్తవయసు త్వరగా ప్రారంభమవుతుందని.. ఇవి తమ మొదటి పీరియడ్స్‌ను ప్రేరేపిస్తూ.. ప్రమాదకరంగా మారుతున్నాయని వెల్లడించారు. చిన్న వయసులోనే అధిక బరువు ఉండడం వల్ల కూడా త్వరగా పెద్దమనిషి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.
పరిసర ప్రాంతాలు కూడా..
బాలికల్లో ఎర్లీ పీరియడ్స్‌కు పరిసర ప్రాంతాలు కూడా ఓ కారణమవుతున్నాయంటున్నారు. విషపూరితమైన, కాలుష్యం అధికంగా ఉండే గాలిని పీల్చుకోవడం బాలికలపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తున్నాయట. ఇవేకాకుండా పర్యావరణ కారకాలు, ఒత్తిడి, కొన్నిరకాల రసాయనాలు, లైంగిక హార్మోన్లు ప్రేరేపించే విషయాలు.. పిల్లల్లో రజస్వలకు కారణమవుతున్నాయి. అయితే ఈ కారణాలన్నీ.. కేవలం రజస్వలపైనే కాకుండా.. వారిలో లైంగిక కోరికలు పెరగడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నాయట.
ముందుగానే పెద్దమనిషి అయితే..
యుక్తవయసు కంటే ముందుగానే రుతుక్రమం ప్రారంభమైతే.. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు పెరగవచ్చు అంటున్నారు. పునరుత్పత్తి క్యాన్సర్లు, హృదయ సంబంధ వ్యాధులు, జీవక్రియ రుగ్మతలు, లైంగిక సమస్యలు ఇబ్బంది పెడతాయంటున్నారు. ఇవన్నీ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటున్నాయని తెలిపారు. సంతానోత్పత్తి కూడా తక్కువగా ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ సమస్యలు కూడా రావొచ్చని చెప్తున్నారు. కేవలం శారీరక సమస్యలే కాకుండా.. మానసిక సమస్యలు కూడా వారిని ఇబ్బంది పెడతాయంటున్నారు. నిరాశ, ఆత్మవిశావసం లేకపోవడం వంటి ప్రమాదకరమైన మానసిక సమస్యలు ఉంటాయని స్టడీలో తేల్చారు.
Also Read : పిల్లలు పుట్టేందుకు ఏజ్ లిమిట్ ఉందా? ఆ వయసు దాటితే పేరెంట్స్ కాలేరా?