పీరియడ్స్ సమయంలో చాలామందికి హెవీ బ్లీడ్ అవుతూ ఉంటుంది.

దీనివల్ల పీరియడ్ క్రాంప్స్ కూడా ఎక్కువ అవుతాయి.

ఈ సమస్యని కంట్రోల్ చేయడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అవ్వొచ్చు.

హెవీ బ్లీడ్ అవుతుంటే అల్లం టీని తాగితే రిలీఫ్​గా ఉండడంతో పాటు బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది.

అల్లంలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

దాల్చిన చెక్క టీ కూడా పీరియడ్స్​లో కలిగే సమస్యలన్ని దూరం చేస్తుంది.

దీనిలోని లక్షణాలు హెవీ బ్లీడింగ్​ని తగ్గిస్తాయి. దీనిని మీరు డైట్​లో కూడా తీసుకోవచ్చు.

విటమిన్ సి పీరియడ్స్ సమయంలోనే కాదు రెగ్యూలర్​గా తీసుకోవడం కూడా చాలా మంచిది.

పీరియడ్స్ నొప్పి, బ్లీడింగ్​ని ఇది తగ్గిస్తుంది. స్కిన్​కి కూడా మంచి ప్రయోజనాలు అందిస్తుంది.

శరీరంలో ఐరన్ తగ్గితే బ్లీడ్ ఎక్కువగా అయ్యే అవకాశం ఎక్కువ.

కాబట్టి మీ డైట్​లో పాలకూర, బీన్స్, రెడ్ మీట్ వంటి తీసుకుంటే ఐరన్ పెరుగుతుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)