పాలు న్యూట్రిషియన్ బెనిఫిట్స్ ఇస్తాయి. ఆరోగ్యానికి చాలా మంచివి.

అయితే వీటిని ఎక్కువగా తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటున్నారు.

పాలల్లో లాక్టోస్ ఉంటుంది. దీనిని ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలు పెరుగుతాయి.

కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా, క్రాంప్స్ సమస్యలు వస్తాయి.

పాలు ఎక్కువగా తీసుకుంటే పింపుల్స్ సమస్య ఎక్కువ అవుతుంది.

పాలల్లోని కాల్షియం ఎముకలకు మంచిది. కానీ దీనిని ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ స్టోన్ వచ్చే అవకాశం పెరుగుతుంది.

పాలల్లోని కేలరీలు బరువును పెరిగేలా చేస్తాయి. దానిలో పంచదార వేసుకుంటే ఈ అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది.

పాలల్లోని ఫ్యాట్స్ కొలెస్ట్రాల్​ను పెంచి.. గుండె సమస్యలను పెంచుతాయి.

అందుకే పాలను లిమిట్​గా తీసుకోవాలంటున్నారు. అప్పుడే వాటి బెనిఫిట్స్ పూర్తిస్థాయిలో పొందుతారు.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)