మూత్రాన్ని బలవంతంగా ఆపుకుంటున్నారా? అయితే చావే!

చాలామంది మూత్రాన్ని బలవంతంగా ఆపుకుంటారు. ఆఫీసులో, ప్రయాణాల్లో ఎక్కువగా ఇలా చేస్తారు.

ఉగ్గబెట్టుకుని కూర్చోవడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మూత్రాశయం (బ్లాడర్) మీద ఒత్తిడి పడుతుంది.

ఎందుకంటే.. మన మూత్రాశయం 600 మిల్లీ లీటర్లు మించి మూత్రాన్ని నిల్వ చేయలేదు.

అంతకంటే ఎక్కువ మూత్రం వచ్చి చేరితే బ్లాడర్‌ పగిలిపోయే ప్రమాదం ఉంది. అది ప్రాణాలకే ముప్పు.

మూత్రాన్ని ఆపుకోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) ఏర్పడవచ్చు.

మూత్రం ద్వారా బయటకు పోవల్సిన బ్యాక్టీరియా బ్లాడర్‌లోనే ఉండిపోతుంది. దాని వల్ల రోగాలు వస్తాయి.

శరీరంలోని వ్యర్థాలన్నీ మూత్రంలోనే ఉంటాయి. అవి అవి కాల్షియం స‌మ్మేళ‌నాలుగా మారి కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.

మూత్రాన్ని ఆపుకుంటే పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనపడతాయి. తర్వాత మూత్రాన్ని కంట్రోల్ చెయ్యలేం.

Images and Videos Credit: Pexels and Pixabay