ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు. అందులో నిజం లేకపోలేదు. కొంతమంది పచ్చి ఉల్లిపాయలను తినేందుకు ఇష్టపడరు. నోరంతా వాసన వస్తుందని, తినలేం అని అంటారు. మరి పచ్చిఉల్లిపాయ వల్ల కలిగే లాభాలు ఒకసారి చూద్దామా! పచ్చి ఉల్లిపాయలో సి, బీ6 విటమిన్లు ఉంటాయి. ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం అధికం. క్వార్సిటిన్, సల్ఫర్ బీపీని, కొలస్ట్రాలు లెవెల్స్ ని తగ్గిస్తుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఉల్లిపాయలోని విటమిన్ సి తెల్ల రక్తకణాలు పెరిగేలా చేస్తుంది. దాంతో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది అరుగుదలకు మంచిది. కాన్ స్టిపేషన్ లాంటి సమస్యలు రావు. సల్ఫర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి. ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం ఏబీపీని ఫాలో అవ్వండి.