Image Source: pexels

షుగర్ పేషంట్లు తినాల్సిన హెల్తీ స్నాక్స్ ఇవే

మీకు డయాబెటిస్ ఉందా? స్నాక్స్ తినాలంటే భయమేస్తోందా? అయితే.. ఇవి ప్రయత్నించండి.

ఉడికించిన గుడ్లు బెస్ట్ స్నాక్. గుడ్లలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది.

అవొకాడో షుగర్ పేషంట్లకు మంచిదే. మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ బ్లడ్ షుగర్ పెరగకుండా అడ్డుకుంటాయి.

కాటేజ్ చీజ్ ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.

చియా సీడ్ ఫుడ్డింగ్ కూడా బెస్ట్ స్నాక్. చియా గింజలను పాలలో నానబెట్టి, గ్రానోలా, బెర్రీలతో దీన్ని తయారు చేస్తారు.

షుగర్ ఉన్నవారికి బెస్ట్ స్నాక్. ఇందులో ఖనిజాలు, పోషకాలు ఉన్నాయి. హమ్మస్ ను రోజూ తినవచ్చు.

వేయించిన వేరుశనగల్లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. మీకు ఇష్టమైన మసాలా దినుసులను కూడా యాడ్ చేసుకోవచ్చు.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.