Image Source: pexels

నోరు చేదుగా ఉంటోందా? ఇదే కారణం కావొచ్చు

నోరు చేదుగా ఉండేందుకు కారణాలు ఎన్నో ఉంటాయి. వయస్సు మీదపడేకొద్దీ నాలుకపై టేస్టింగ్ బడ్స్ తగ్గుతాయి.

కావాల్సినంత లాలాజలం ఉత్పత్తి కాని సమయంలో నోరంతా చేదుగా మారుతుంది.

దాహం వేయడం, నోరంతా పొడిబారడం, లాలాజలం జిగురుగా మారడం వల్ల కూడా నోరు చేదుగా మారుతుంది.

ఎండలో బయటకు వెళ్లినప్పుడు ఒంట్లో నీరసంగా ఉంటుంది. చెమట రూపంలో ఖనిజాలన్నీ బయటకు వెళ్తాయి.

ఇలాంటి పరిస్థితుల్లో నోరుపొడిబారి నోరు మరింత చేదుగా అనిపిస్తుంది.

నోరుగా చేదుగా ఉన్న సమయంలో పదే పదే నీరు తాగాలి. ఓఆర్ఎస్ తాగుతుండాలి.

కొందరిలో జాగ్రలోమ్ సిండమ్స్ వంటి కారణాలతో కూడా నోరు చేదుగా మారుతుంది.

చాలామంది చిగుళ్లు, దంత సమస్యలను పట్టించుకోరు. ఇలాంటి సమస్యలున్నా నోరు చేదుగా మారుతుంది.

ఆల్కాహాల్, మద్యపానం అలవాటు ఉన్నవారికి సమస్య ఉంటుంది. జలుబు, సైనస్ సమస్యలు ఉన్నవారికి ఇలా జరుగుతుంది.

Image Source: pexels

కొన్ని రకాల మందుల వల్ల కూడా నోరు చేదుగా మారుతుంది. ఈసమస్యలు మీలో ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించండి.