డ్రైఫ్రూట్స్ లో ఉండే పోషకాలు, నేతిలో ఉండే పోషకాలతో కలిస్తే ఆరోగ్యానికి మంచిది. నెయ్యిలో ఒమెగా - 3 యాసిడ్స్ ఎక్కువ. గుండెకు మంచిది, వెయిట్ ని మెయింటెయిన్ చేస్తుంది. ఇన్ ఫ్లమేషన్ తగ్గుతుంది. డ్రైఫ్రూట్స్ లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. డ్రైఫ్రూట్స్ ని నెయ్యిలో వేయిస్తే.. పోషకాలు ఇంకా పెరుగుతాయి. నెయ్యి యాసిడ్స్ ని రిలీజ్ చేస్తుంది. అది ఫుడ్ అరిగేలా చేస్తుంది. నెయ్యిలో వేయిస్తే డ్రై ఫ్రూట్స్ ఈజీగా అరుగుతాయి. నెయ్యిలోని హెల్దీ ఫ్యాట్, డ్రైఫ్రూట్స్ లోని షుగర్ రెండూ కలిస్తే ఎనర్జీ బూస్ట్ అవుతుంది. యాక్టివ్ గా, ఫోకస్ గా ఉండేందుకు ఉపయోగపడుతుంది. డ్రైఫూట్స్ లో ఉండే విటమిన్స్ A, D, Kలు శరీరానికి అందాలంటే నెయ్యిలో వేగించుకుని తినాలి. నెయ్యిలో ఉండే హెల్దీ ఫ్యాట్స్ కొలస్ట్రాల్ లెవెల్ ని సరి చేస్తుంది, గుండెకు మంచిది. వాల్ నట్స్, బాదంపప్పు కలిస్తే హార్ట్ ఫ్ల్రెండ్లీ స్నాక్. పరిమితి ప్రకారం నెయ్యి, డ్రైఫ్రూట్స్ కలిపి తింటే.. వెయిట్ లాస్ కి ఉపయోగపడుతుంది. అవి తింటే.. పొట్ట ఫుల్లుగా అనిపిస్తుంది. దీంతో తిండి తక్కువ తిని వెయిట్ లాస్ అవుతారు.