Late Pregnancy : పిల్లలు పుట్టేందుకు ఏజ్ లిమిట్ ఉందా? ఆ వయసు దాటితే పేరెంట్స్ కాలేరా?
How old is too old to get Pregnancy : వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని.. పిల్లల్ని కనేయాలంటారు పెద్దలు. అంటే వయసు అయిపోతే పిల్లలు పుట్టరా? అసలు ఏ ఏజ్ వచ్చేవరకు పిల్లల్ని కనొచ్చు.
Age Limit for Pregnancy : వయసుతో ప్రమేయం లేకుండా ప్రెగ్నెంట్ అవ్వొచ్చా? అసలు ఏ వయసు దాటాక ప్రెగ్నెంట్ కాలేము? ఇలాంటి ప్రశ్నలన్నీ చాలామందిలో ఉంటాయి. ఎందుకంటే.. కెరీర్లో సెటిల్ అయ్యేవరకు పెళ్లి చేసుకోరు కొందరు. ఆ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్‌ని కాస్త వాయిదా వేసి.. ఫినాన్షియల్‌గా సెటిల్ కావాలని చూస్తారు. కానీ.. వయసు పెరిగితే పిల్లలు పుట్టరు.. త్వరగా పిల్లల్ని కనేసి మా మొహాన పడేయండి.. మేము చూసుకుంటాము అంటారు పెద్దలు. నిజంగానే వయసు పెరిగితే పిల్లలు పుట్టరా? ఏ వయసు వరకు పిల్లలు కనొచ్చు. నిపుణులు ఇచ్చే సలహా ఏమిటి?
సాంకేతిక ఎంత పెరిగినా.. కొన్ని సంప్రదాయాలు వాటిని డామినేట్ చేస్తూనే ఉన్నాయి. సమాజంలో మార్పులు, కెరీర్‌పై ఫోకస్ పెరగడం.. పెళ్లి చేసుకున్న వెంటనే ఫ్యామిలీని ప్రారంభించడం అనేవి ఇప్పుడు జరగట్లేదు. సింపుల్‌గా ఇప్పుడు పిల్లులు.. అనేసరికి.. నో అనేస్తున్నారు. వివిధ కారణాల వల్ల డైనామిక్ పేరెంట్ హుడ్‌ని వాయిదా వేసుకుంటున్నారు. ప్రెగ్నెన్సీ విషయంలో సాంకేతికత కూడా డెవలప్ అయింది కాబట్టి ఎప్పుడైనా పిల్లల్ని కనేయొచ్చు అనుకుంటున్నారు. కానీ వారి పేరెంట్స్ మాత్రం దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.
పిల్లలు లేకుండానే ఆ వయసు దాటేస్తున్నారట..
ప్రతిదానికి లిమిట్ ఉన్నట్లే స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థకి కూడా కొన్ని కండీషన్స్ ఉన్నాయంటుంది. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన ఓ అధ్యయనంలో.. మహిళలు పిల్లలు లేకుండానే తమ 30లలోకి వెళ్లిపోతున్నారని తెలిపింది. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా.. లేట్ మామ్ అనే ధోరణి జరుగుతోందని తెలిపింది. 90లలో జన్మించిన వారిలో సగం మంది మహిళలు పిల్లలను కనకూడదని నిర్ణయించుకున్నట్లు పరిశోధనలో తేలింది.
మరి ఈ లేట్ ప్రెగ్నెస్సీ మంచిదేనా?
లేట్ ప్రెగ్నెన్సీ అనేది స్త్రీ ఆరోగ్యంపై పూర్తిగా ప్రభావం చూపిస్తుంది. చాలామంది వైద్యులు 35 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెంట్ అయితే కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. కొందరికి అన్ని సమస్యలు లేకపోయినా.. మరికొందరికి కచ్చితంగా ఉంటాయంటున్నారు. ఈ రెండు కూడా స్త్రీ ఎంత ఆరోగ్యంగా ఉంది అనేదానిపై ఆధారపడి ఉంటాయి.
ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది.. దీనివల్ల
ముఖ్యంగా స్త్రీ విడుదల చేసే అండాశయం, గుడ్డు నాణ్యత, ఓసైట్ నాణ్యత 35 సంవత్సరాల తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. 40 సంవత్సరాలు దాటితే అది దాదాపు క్షీణిస్తుంది. ఇది క్రోమోజోమ్ అసాధారణతల ప్రమాదాన్ని పెంచుతుందని గైనకాలజిస్ట్లు చెప్తున్నారు. అంతేకాకుండా వయసు దాటాక పుట్టే పిల్లలు డౌన్ సిండ్రోమ్ వంటి అసాధారణ లక్షణాలతో పుట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తల్లి వయసు పెద్దది అయితే డౌన్ సిండ్రోమ్, తండ్రి వృద్ధుడైతే.. మార్ఫాన్స్ సిండ్రోమ్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఆ వయసు దాటితే ఇద్దరికీ కష్టమే
మహిళలు ఆలస్యంగా గర్భం దాల్చలనుకున్నప్పుడు.. కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు చెప్తున్నారు. 50 ఏళ్లు దాటిన తర్వాత ప్రెగ్నెంట్ కావడం వల్ల బిడ్డకి, తల్లికి అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ సమయంలో ప్రెగ్నెంట్ కావాలనుకుంటే సరోగసి ద్వారా పిల్లల్ని కనొచ్చని సూచిస్తున్నారు. ఇది కేవలం మహిళల ఛాయిస్నే కాదు. పురుషులు కూడా లేట్ ప్రెగ్నెన్సీకి కారణమవుతున్నారు.
స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుంది
మగవారిలో వయసు అయిపోతే.. వారిలో స్పెర్మ్ ఉత్పత్తి తగ్గుతుంది. ముఖ్యంగా వాటి నాణ్యత వయసుతో పాటు క్షీణిస్తుంది. పలు అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. స్పెర్మ్ నాణ్యత లేకపోవడం వల్ల పిల్లల్లో జన్యుపరమైన వ్యాధులు వచ్చే అవకాశముంది. ఆటిజం, స్కిజోఫ్రెనియా, బైపోలార్ డిజార్డర్ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది పరిశోధనలు చెప్తున్నాయి.
ఛాన్సులు ఉన్నాయి కానీ..
వయసైనా పిల్లలు పుడతారు కానీ.. వివిధ కాంప్లికేషన్లు మాత్రం కచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా వారితో ఎక్కువ సమయం గడపలేని స్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా పిల్లలను ప్లాన్ చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లేదు కుదరదు అనుకున్నప్పుడు వివిధ మార్గాల ద్వారా పిల్లలను పొందవచ్చని చెప్తున్నారు.
Also Read : మీ భర్త లేదా భార్యతో గొడవలు ఎక్కువగా అవుతున్నాయా? అయితే ఇది మీకోసమే