ఫెర్టిలిటీ సమస్య ఉంటే ప్రెగ్నెంట్ కావడం, అయిన తర్వాత కాంప్లికేషన్స్ రావడం సహజం. అందుకే ఆ సమస్య ఉన్నవారు ఫుడ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆహారాలకు దూరంగా ఉండడంతో పాటు.. కొన్ని ఫుడ్స్ రెగ్యూలర్ తీసుకుంటే మంచిది. బ్లూ బెర్రీల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఫెర్టిలిటీ సమస్యను దూరం చేస్తాయి. ఓమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ కలిగిన ఫుడ్ కూడా చాలా మంచిది. ఆకుకూరల్లోని విటమిన్లు, ఫోలిక్ యాసిడ్స్ ఆరోగ్యానికి మంచివి. అవకాడోని టోస్ట్, సలాడ్స్ వంటి వాటితో కలిపి తీసుకోవచ్చు. గుడ్లు కూడా శిశువు ఎదుగుదలకు మంచి చేస్తాయి. గ్రీక్ యోగర్ట్ ప్రోటీన్, ప్రోబయోటిక్స్ వంటివాటితో నిండి ఉంటుంది. నట్స్, సీడ్స్ కూడా ఫెర్టిలిటీ సమస్యను దూరం చేస్తాయి. ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. (All Images Source : Envato)