ఈ జంతువులు ఆహారాన్ని నమలకుండా మింగేస్తాయట! కొన్ని జంతువులు ఆహారాన్ని నమలకుండానే మింగుతాయి. చాలా చిత్రంగా ఉంది కదూ. ఔనండి.. కొన్ని జంతువులకు దంతాలు ఉండవు. దీంతో అవి ఆహారం నమలకుండానే మింగేస్తాయి. పాములు తమ ఆహారాన్ని నమలకుండా మింగుతాయి. పాములకంటే పెద్దవాటిని కూడా అమాంతంగా మింగే దవడలు ఉంటాయి. కప్పలు కీటకాలను, ఇతర చిన్న ఎరలను పట్టుకునేందుకు జిగట నాలుకలను ఉపయోగిస్తాయి. నమలకుండానే మింగుతాయి. పెలికాన్లు నీళ్లతోపాటు చేపలను పైకి లేపుతాయి. చేపలను అమాంతం మింగడానికి తలను వెనకకు వంచుతాయి. మొసళ్లకు దంతాలున్నా.. నమిలి తినకుండా మింగేస్తాయి. దీని కడుపులో బలమైన ఆమ్లాలు ఉంటాయి. కాబట్జి.. జీర్ణం సులభం. డాల్ఫిన్లు వాటి పదునైన దంతాలను ఎరగా వాడతాయి. నమలకుండానే మింగేస్తాయి.