లిచీ తింటే కలిగే లాభనష్టాలు ఇవే లిచీ వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. లిచీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకంతో బాధపడేవారికి మంచి ఫలితం ఇస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ లిచీ తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. పాలీఫెనాల్స్ వంటీ యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఇందులో ఉండే చక్కెర, కేలరీలు ఆర్థరైటిస్ నొప్పిని ప్రేరేపిస్తాయి. లిచీని ఎక్కువగా తింటే ఊబకాయం, గొంతు నొప్పి వస్తుంది. ఆస్తమా పేషెంట్ కు లిచీ ఎక్కువగా తినడం వల్ల శ్వాసతీసుకోవడంలో సమస్యలు ఏర్పడతాయి. లిచీని మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు.