బోడకాకరకాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? బోడకాకరకాయను స్పైనీ గోర్డ్ అని కూడా పిలుస్తారు. ఇందులో అనేక పోషక విలువలు ఉన్నాయి. వర్షాకాలంలో ఎక్కువగా సాగు చేస్తారు. చాలా మంది దీన్ని ఆహారంలో చేర్చుకుంటారు. బోడకాకరకాయను ఇతర కూరగాయలతో పోల్చితే ఎక్కువ పోషకాలు ఉన్నాయి. వీటికి గురించి ఎక్కువ మందికి తెలియదు. బోడకాకరకాయను ఆహారంలో చేర్చుకుంటే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం. బోడ కాకరకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్లు ఏ, సి, కె వంటి ముఖ్యపోషకాలు ఉన్నాయి. కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి ఇందులో ఫైబర్ కంటెంట్ క్రమంగా ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం, ఉబ్బరం తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్లో ఉంచుతుంది. ఆరోగ్యకరమైన రక్తపోటు స్థాయిలను నిర్వహిస్తుంది. ముఖంపై మొటిమలు, తామర వంటి చర్మ సమస్యలకు చికిత్స చేసేందుకు ఈ రసాన్ని, గింజలను ఉపయోగిస్తారు. బరువు తగ్గాలనుకునేవారు బోడకాకరకాయలను ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.