అన్వేషించండి

Relationship Tips : మీ భర్త లేదా భార్యతో గొడవలు ఎక్కువగా అవుతున్నాయా? అయితే ఇది మీకోసమే

Happy Couples : భార్యభర్తలు కలిసి ఉండాలంటే కేవలం శారీరకంగానే కాదు.. మానసికంగా వారు ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఈ టిప్స్ ఫాలో అయితే రిలేషన్​లో హ్యాపీగా ఉండొచ్చని చెప్తున్నారు. 

Healthy Realtionships : ప్రస్తుతం విడాకుల ట్రెండ్(Divorce Trend) ఎక్కువగా నడుస్తోంది. ఒకప్పుడు బ్రేకప్​లతోనే సరిపోట్టేవారు.. ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి.. పెళ్లి చేసుకుని.. విడాకుల బాట పడుతున్నారు. పెళ్లి చేసుకోవాలనే ఆత్రం ఎంత అయితే ఉంటుందో.. విడిపోవాలనే కుతుహలం కూడా అంతే ఎక్కువైతుందనేది నిపుణుల వాదన. అయితే వైవాహిక జీవితం హ్యాపీగా ఉండాలంటే.. భర్త, భార్య కూడా కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లైంగికంగానే కాదు.. మానసికంగా కూడా వారు దగ్గరగా ఉండేందుకు కొన్ని సలహాలు ఇస్తున్నారు. అవేంటంటే.. 

ఇద్దరు విడిపోవడానికి ఎన్ని ప్లానింగ్స్ వేస్తున్నారో.. ఇద్దరు కలిసి ఉండడానికి కూడా అన్ని ప్లానింగ్స్ వేయాలంటున్నారు. ఓ రిలేషన్ బాగుండాలంటే ఇద్దరు కచ్చితంగా ఎఫెర్ట్స్ పెట్టాలంటున్నారు. వారి మధ్య సంబంధం హెల్తీగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కొన్ని విషయాలు కచ్చితంగా ఫాలో అవ్వాలి. అలా అని ఓ రిలేషన్​లో గొడవలు ఉండవని కాదు అని.. అవి కామన్​ అని.. కానీ ఆ సమయంలో ఎలా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారో అదే మీరు బంధాన్ని కాపాడుకోవడానికి ఇచ్చే ఎఫర్ట్ అంటున్నారు. 

రిలేషన్​ని గౌరవించండి.. 

ఏ ఇద్దరూ ఒకలా ఉండరు. అలాంటప్పుడు ఆ జంటలా మనం ఉండట్లేదని పోలిక ఎందుకని ప్రశ్నిస్తున్నారు నిపుణులు. మీరు నిజంగా హ్యాపీగా ఉండాలనుకుంటే.. ఇతరులతో మీ సంసారాన్ని పోల్చుకోకూడదని.. కష్టాల్లో, సుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉండాలని చెప్తున్నారు. అంతేకాకుండా ఎవరైనా మీ భాగస్వామిపై ఫన్నీ కామెంట్స్ చేస్తుంటే.. మీరు కూడా వారితో కలిసి హేళన చేయకుండా.. అలా కామెంట్స్ చేసే వారిని కంట్రోల్ చేసి.. మీ భాగస్వామి రెస్పెక్ట్ పెంచాలి. దీనివల్ల మీ బంధం మరింత బలపడుతుంది.

సాన్నీహిత్యం..

క్లోజ్​నెస్​ అనేది లైంగికంగానే కాదు.. మానసికంగా కూడా ఉండాల్సిన ఓ అతి ముఖ్యమైన ప్రక్రియ. ఎందుకంటే లైంగిక వాంఛ ఈరోజు ఉన్నా.. రేపు ఉండకపోవచ్చు. కానీ మీరు ఇద్దరు మానసికంగా హ్యాపీగా ఉంటే.. మీ రిలేషన్ చాలా బాగుంటుంది. అలా అని శారీరకంగా అనే దానిని నెగ్లెక్ట్ చేయాలని కాదు.. అది కూడా భార్య భర్తల రిలేషన్​లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే మీరు మానసికంగా కూడా దగ్గరగా ఉంటే ఎలాంటి ఆందోళనలు, భయాలు ఉండవు.  ఇది మీకు మంచి ఫ్యామిలీ వాతావరణాన్ని ఇస్తుంది. 

కాంప్లిమెంట్స్ ఇచ్చుకోండి..

మీ పార్టనర్​ అందంగా ముస్తాబైనప్పుడు.. లేదా న్యాచురల్​గా బాగున్నప్పుడు.. ఏదైనా పనిచేస్తున్నప్పుడు మీకు నచ్చితే.. కచ్చితంగా వారికో కాంప్లిమెంట్ ఇవ్వండి. కాంప్లిమెంట్స్ అనేవి రిలేషన్​కి బూస్టింగ్ ఇచ్చే మెడిసన్స్​ లాంటివి. కాబట్టి అప్పుడప్పుడు మీ భాగస్వామికి ఓ కాంప్లిమెంట్ ఇచ్చేయండి.

ఈ విషయాల్లో కూడా

ఇవే కాకుండా కొన్ని విషయాల్లో దంపతులు కచ్చితంగా తమ రిలేషన్​ని కాపాడుకునేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. మీ భాగస్వామి ఏదైనా చెప్తే.. మీరు అంగీకరించాలి. మీ ఆలోచనల్ని వారిపై రుద్దే ముందు.. వారు చెప్పేది కూడా మీరు పూర్తిగా విని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. అంతేకాకుండా మీ ఇద్దరూ బిజీగా ఉండేవారు అయితే.. కచ్చితంగా మీ పార్టనర్​తో కలిసి ఉండేందుకు ప్లానింగ్స్ చేస్తూ ఉండాలి. ఆ సమయంలో మీ వర్క్​, ఇతర వ్యవహారాలు ఉండకుండా చూసుకోవాలి. మీరు తప్పు చేశారనిపిస్తే కచ్చితంగా మీ పార్టనర్​కి సారీ చెప్పండి. కాంప్లీమెంట్స్ ఇవ్వడం ఎంత అవసరమో.. క్షమాపణ చెప్పడం కూడా అంతే అవసరం. మీ భాగస్వామి దగ్గర కాస్త తగ్గితే.. వారి కోపమూ తగ్గుతుంది.. మీ బంధము నిలబడుతుంది. 

Also Read : వైఫ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు భర్త ఇలా చేస్తే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువట

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Sai Durgha Tej - Pawan Kalyan: జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Embed widget