Rebel Saab Song Lyrics: రెబల్ సాబ్ సాంగ్ లిరిక్స్... పాన్ ఇండియా No1 బ్యాచిలర్ ప్రభాసేలే - ట్రెండింగ్‌లో ప్రభాస్ 'ది రాజా సాబ్' ఫస్ట్ సింగిల్!
The Raja Saab First Song Lyrics: ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్ట్ చేస్తున్న 'ది రాజా సాబ్'లో ఫస్ట్ సింగిల్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ సాంగ్ లిరిక్స్ చూస్తే...

Prabhas 'The Raja Saab' First Song Rebel Saab Lyrics: ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా హారర్ థ్రిల్లర్ 'ది రాజా సాబ్'. ఇందులోని ఫస్ట్ సాంగ్ 'రెబల్ సాబ్' ట్రెండ్ అవుతోంది. ప్రభాస్ పెళ్లి కోసం పాన్ ఇండియా లెవల్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో... 'పాన్ ఇండియా నంబర్ వన్ బ్యాచిలర్ నేనేలే' అంటూ వచ్చిందీ పాట. సోషల్ మీడియాలో ఈ లిరిక్స్ వైరల్ అవుతున్నాయి.
తమన్ సంగీతం అందించిన 'రెబల్ సాబ్' పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. తెలుగులో ఈ పాటను సంజిత్ హెగ్డే పాడారు. బ్లేజ్ ర్యాప్ పాడారు. ఇది హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అని తెలుస్తోంది. ప్రజెంట్ చార్ట్ బస్టర్ అయిన ఈ సాంగ్ లిరిక్స్ చూస్తే...
'ది రాజా సాబ్' ఫస్ట్ సింగిల్ 'రెబల్ సాబ్' లిరిక్స్...
He got flow
He got style
Making movie with a smile
Everybody step aside step aside
Raja coming to vibe
రెబల్ సాబ్ రెబల్ సాబ్...
రొమాంటిక్ రెబల్ సాబ్
వస్తున్నాడు స్టెప్ ఏ సైడ్ ఏ సైడ్...
లుకింగ్ ఫర్ ద బ్రైడ్
ఆలీ బాబా జాలీ స్టోర్...
లెట్స్ స్టెప్ ఆన్ ద డ్యాన్స్ ఫ్లోర్
గుండె జరా నాచో మోర్...
రాజా వైబ్ సెట్టో సెట్
everybody back the door
Count it on the two and four
Get some boys floor
We'll make some noise and
రాజా వైబ్ సెట్టో సెట్!
సింగారే సింగ సింగ... సింగిల్ గున్నగా
భార్య బంగారం లేక బోర్ అయితున్నాగా
ఏడుందో నాక్కాబోయే పిల్లే హ్యాపీగా
ఏ మేడెక్కి వయ్యారాలు పడుతుందో హ్యాపీగా
రాజా... తేరా స్వాగ్ సూపర్
రాజా... తేరా స్టైల్ బంపర్
రాజా... తేరా ఎంట్రీ లెవెల్ బ్యాంగర్ బ్యాంగర్ బ్యాంగర్ బ్యాంగరు
రాజా... దిల్ ఖోల్ కే తూ ఆజా కరెంగే పార్టీ
పాన్ ఇండియా నంబర్ వన్...
పాన్ ఇండియా నంబర్ వన్ బ్యాచిలర్ నేనేలే! (రెబల్ సాబ్ రెబల్ సాబ్...)
Also Read: ప్రభాస్ 'స్పిరిట్' సినిమాకు ఆ ఇద్దరూ అసిస్టెంట్ డైరెక్టర్లు... ఇది మాటలకు అందని మాస్ మూమెంట్!
ఇలవేల్పువే నీవు తల్లి దుర్గమ్మా...
మా ఇంటి మనవడిని దీవించవమ్మా
ఏళ్లెదిగినా వాడు పసివాడేనమ్మా...
ఎండల కన్ను సోకి వసివాడేనమ్మా
ఏ జన్మకూ తోడు నీవే కదమ్మా...
నీ కంటి పాపల్లే కాపాడవమ్మా
సూడగానే దిమ్మెత్తి పోయే... బుజ్జిపండు పుట్టనే లేదా
టింగుమంటూ తన గుండెలోనా ఇంకా... పెళ్లి గంట కొట్టనే లేదా
అరే... మై డియర్ గూగులూ... ఎహే యాడుందో నా బుల్ బులూ
ఎహే చాలే పడి గప్పులు... రాయే రాని ఏంజెలూ
బెగొచ్చేయ్ బ్యాంకాక్ హనీమూనూ పోదాం (రాజా... తేరా స్వాగ్ సూపర్)
Also Read: 'ది రాజా సాబ్'కు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? హీరోయిన్లు, ఆర్టిస్టులకు అందులో సగం కూడా ఇవ్వలేదు
ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. జనవరి 9, 2026న థియేటర్లలోకి సినిమా వస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు.





















