Prabhas Remuneration For The Raja Saab: 'ది రాజా సాబ్'కు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? హీరోయిన్లు, ఆర్టిస్టులకు అందులో సగం కూడా ఇవ్వలేదు
The Raja Saab Cast Remunration: సంక్రాంతికి 'ది రాజా సాబ్' విడుదల అవుతుంది. అయితే ప్రమోషన్లు మొదలు పెట్టారు. సందడి మొదలైంది. అసలు ఈ సినిమా కోసం ప్రభాస్ సహా ఇతర నటీనటులు ఎంత తీసుకుంటున్నారో తెలుసా?

Prabhas Remuneration For The Raja Saab: ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం హారర్ కామెడీ చిత్రం 'ది రాజా సాబ్' గురించి చర్చల్లో ఉన్నాడు. ఈ సినిమాలో ఆయనతో పాటు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ సహా పలువురు ప్రముఖ నటులు కనిపించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. నవంబర్ 23న ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. అసలు ఈ సినిమాకు ప్రభాస్ సహా ఇతర నటీనటులు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతల నుంచి ఎంత తీసుకున్నారో తెలుసుకుందాం.
అనుపమ్ ఖేర్ @ కోటి
ప్రముఖ హిందీ సినిమా నటుడు అనుపమ్ ఖేర్ 'ది రాజా సాబ్' సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. టైమ్స్ నౌ హిందీ ప్రకారం... 'ది రాజా సాబ్' సినిమా కోసం ఆయనకు 1 కోటి రూపాయలు ఫీజుగా ఇచ్చారు.
Also Read: 50 ఏళ్ల వయసులోనూ మహేష్ బాబు యంగ్ లుక్ వెనుక సీక్రెట్... మెరిసే చర్మం కోసం రోజూ చేసేది ఇదే
View this post on Instagram
మాళవికా మోహనన్ @ కోటిన్నర
ప్రభాస్ ఈ సినిమాలో నటి మాళవిక మోహనన్ కూడా కనిపించనుంది. ఈ హీరోయిన్ తన పాత్ర కోసం 1.5 – 2 కోట్ల రూపాయలు తీసుకుంది. ఆమెతో పాటు మరొక హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal remuneration for The Raja Saab)కు మేకర్స్ 1.2–1.5 కోట్ల రూపాయలు ఫీజుగా ఇచ్చారు.
Also Read: భారీగా 'అఖండ 2' బిజినెస్... థియేటర్ల నుంచి బాలకృష్ణ రాబట్టాల్సిన కలెక్షన్స్ ఎంతంటే?
View this post on Instagram
బ్రహ్మానందం @ 80 లక్షలు
లెజెండరీ కమెడియన్, టాలీవుడ్ స్టార్ బ్రహ్మానందం కూడా 'ది రాజా సాబ్'లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయనకు 80 లక్షల రూపాయలు ఇచ్చారు.
View this post on Instagram
సంజయ్ దత్ @ 6 కోట్లు
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ 'ది రాజా సాబ్' సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. మేకర్స్ సంజయ్‌కి ఈ సినిమా కోసం 5 నుండి 6 కోట్ల రూపాయల భారీ ఫీజును అందించారు. ఆయన ఇంతకు ముందు కూడా పలు సౌత్ సినిమాల్లో నటించారు.
View this post on Instagram
ప్రభాస్ @ 100 కోట్లు
ఇప్పుడు 'ది రాజా సాబ్'లో హీరో ప్రభాస్ రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుకుందాం. బాలీవుడ్ నివేదికల ప్రకారం... ఆయనకు నిర్మాతలు 100 కోట్ల రూపాయల భారీ ఫీజును అందించారు. ఈ సినిమాను దర్శకుడు మారుతి తెరకెక్కించారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. సినిమా విడుదల తేదీ జనవరి 9.
View this post on Instagram
Also Read: బచ్చాగాడికి బిల్డప్పా... బీస్ట్ మోడ్‌లో హరీష్ కళ్యాణ్... 'దాషమకాన్' టైటిల్ ప్రోమో రిలీజ్!





















