Dashamakan Promo: బచ్చాగాడికి బిల్డప్పా... బీస్ట్ మోడ్‌లో హరీష్ కళ్యాణ్... 'దాషమకాన్' టైటిల్ ప్రోమో రిలీజ్!
Harish Kalyan's Dashamakan Movie: హరీష్ కళ్యాణ్ హీరోగా వినీత్ వరప్రసాద్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'దాషమకాన్'. ఈ రోజు టైటిల్ ప్రోమో విడుదల చేశారు.

Harish Kalyan's action entertainer Dashamakan updates: 'జెర్సీ'లో అతిథి పాత్రలో తళుక్కుమన్న హీరో గుర్తు ఉన్నారా? సినిమా చివరిలో న్యాచురల్ స్టార్ నాని తనయుడిగా కనిపించారు. ఓటీటీలో తెలుగు ప్రేక్షకులు సైతం ఎక్కువగా చూసిన సినిమా 'పార్కింగ్'లో హీరో... అతనే హరీష్ కళ్యాణ్ (Harish Kalyan upcoming movie). వైవిధ్యమైన కథాంశాలతో కూడిన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆయన కథానాయకుడుగా నటిస్తున్న తాజా సినిమా 'దాషమకాన్'. ఇవాళ టైటిల్ ప్రోమో విడుదల చేశారు.
బచ్చాగాడికి బిల్డప్పా?
Watch Dashamakan Title Promo: 'దాషమకాన్' టైటిల్ ప్రోమో చూస్తే... మాస్ ఏరియాలో కొంత మంది రౌడీలు గుంపుగా వెళతారు. వాళ్ళకు బాస్ నుంచి ఆదేశాలు వస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు మిస్ కావొద్దని. ఇంతలో రోజ్ బనియన్ వేసుకుని ఓ కుర్రాడు వెళతాడు. అతడిని చూసి 'అన్నా.. బచ్చాగాడు అన్నా. వీడికా ఇంత బిల్డప్ ఇచ్చినావ్' అంటాడు ఒకడు. ఆ తర్వాత అతడిని అనుసరిస్తూ వెళతారు. కట్ చేస్తే... ఫోన్ చేసిన బాస్ మర్డర్ అవుతాడు. ఆ తర్వాత హీరో హరీష్ కళ్యాణ్ ఇంట్రడక్షన్. ఆయన లుక్ కొత్తగా వచ్చింది. ర్యాప్ సాంగ్ కూడా బావుంది. మాంచి మాసీ యాక్షన్ ఉన్నట్టు అర్థం అవుతోంది. అలాగే సింగర్ గానూ కనిపించే అవకాశం ఉంది. రెండు షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నట్టు ఉన్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
హరీష్ కళ్యాణ్ ఇప్పటి వరకు చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్రను ఈ సినిమాలో చేశారని వినీత్ వరప్రసాద్ (Vineeth Varaprasad) తెలిపారు. ఆయన స్వీయ దర్శక నిర్మాణంలో ఐడీఏఏ ప్రొడక్షన్స్, థింక్ స్టూడియోస్ సంస్థలపై మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా 'దాషమకాన్' రూపొందుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
Also Read: '12ఏ రైల్వే కాలనీ' రివ్యూ: అల్లరోడికి 'పొలిమేర' అనిల్ హిట్ ఇచ్చారా? హారర్ థ్రిల్లర్ బావుందా?
హరీష్ కళ్యాణ్ సరసన 'కన్నప్ప' ఫేమ్ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) ఈ 'దామాషాకాన్'లో కథానాయికగా నటిస్తున్నారు. సత్యరాజ్,సునీల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్న ఈ చిత్రానికి సంగీతం: బ్రిట్టో మైకేల్, సినిమాటోగ్రఫీ: కార్తీక్ అశోకన్, ఎడిటర్: జి మదన్, సౌండ్ డిజైన్: తపస్ నాయక్, కళా దర్శకుడు: మణిమొళైన్ రామదురై, నృత్య దర్శకత్వం: రాజు సుందరం - బాబా భాస్కర్ - అమిర్, స్టంట్స్: ఓం ప్రకాష్ - దినేష్ సుబ్బరాయన్.




















