E Scooters in India: మార్కెట్లోకి 3 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూ. 1 లక్ష కంటే తక్కువ ధర.. కి.మీ రేంజ్ వివరాలిలా
E lectric scooters | భారత్ లో యమహా, బజాజ్, ఎథర్ కంపెనీలు Yamaha Aerox-E, Bajaj Chetak, Ather EL లాంటి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు రాబోతున్నాయి. వీటి ఫీచర్లు, ధర ఇక్కడ తెలుసుకుందాం.

Yamaha Aerox E | భారత ఆటో మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రజాదరణ నిరంతరం పెరుగుతోంది. ప్రజలు ఇప్పుడు ఎక్కువ మైలేజ్, తక్కువ ఖర్చు, ఆధునిక ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ రైడ్‌లను ఇష్టపడుతున్నారు. ఈ సమయంలో 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు యమహా Yamaha Aerox-E, New-Gen Bajaj Chetakతో పాటు Ather EL త్వరలో భారతీయ మార్కెట్‌లోకి రానున్నాయి. ఈ మూడు స్కూటర్లను సరసమైన ధర, మెరుగైన టెక్నాలజీతో ప్రవేశపెట్టనున్నారు. వీటి ప్రారంభ ధర రూ. 1 లక్ష కంటే తక్కువగా ఉంటుందని సమాచారం. ఈ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.
యమహా నుంచి Yamaha Aerox-E
ఎలక్ట్రిక్ స్కూటర్ల లిస్టులో మొదటి స్కూటర్ Yamaha Aerox-E. ఇది ప్రత్యేకంగా స్పోర్టీ లుక్, మెరుగైన పనితీరును కోరుకునే రైడర్‌ల కోసం రూపొందించారు. ఇది 9.4 kW మిడ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిగి ఉంది. ఇది 48 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 2 రిమూవ్ చేయగల బ్యాటరీలతో కలిపి, మొత్తం 6 kWh బ్యాటరీ సామర్థ్యం లభిస్తుంది. ఇది 106 కిలోమీటర్ల రేంజ్ జర్నీని అందిస్తుంది. ఈ స్కూటర్ 3 రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది- ఎకో, స్టాండర్డ్, పవర్. అలాగే బూస్ట్ మోడ్ వేగంగా ఓవర్‌టేక్ చేయడానికి సహాయపడుతుంది. ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్, రియర్ ట్విన్ షాక్‌లు, ABSతో కూడిన డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు ఉండటంతో రైడ్‌ను స్థిరంగా ఉంచుతాయి. TFT డిజిటల్ కన్సోల్ బ్లూటూత్, నావిగేషన్, రైడ్ అనలిటిక్స్, OTA అప్‌డేట్‌ల సౌకర్యాన్ని అందిస్తుంది.
బజాజ్ చేతక్- New Gen Bajaj Chetak
Bajaj Chetak పేరు భారతదేశంలో ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు దీని కొత్త తరం మోడల్ ఎలక్ట్రిక్ రూపంలో రానుంది. కొత్త Chetak ఎంట్రీ-లెవెల్ విభాగంపై దృష్టి సారించింది. ఇందులో ఓవల్ LED హెడ్‌లైంప్, ఇంటిగ్రేటెడ్ DRL, కొత్త LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సింగిల్ యూనిట్ LED టైల్‌లైట్ ఉంటాయి. తక్కువ ఖర్చును ఉంచడానికి, ఇది హబ్-మౌంటెడ్ మోటార్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ 3 kWh నుండి 3.5 kWh బ్యాటరీతో వస్తుంది, ఇది 123 నుండి 150 కిలోమీటర్ల జర్నీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్‌లో టచ్‌స్క్రీన్ TFT డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, జియో-ఫెన్సింగ్, మ్యూజిక్ కంట్రోల్, ఇంటిగ్రేటెడ్ మ్యాప్స్ వంటి ఫీచర్‌లు ఉంటాయి. దీని ప్రారంభ ధర రూ. 1 లక్ష కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేశారు.
Ather EL
Ather EL అనేది కంపెనీ బడ్జెట్ ధర, కుటుంబంలో ఎవరైనా వాడగల ఎలక్ట్రిక్ స్కూటర్ అవుతుంది. EL ప్లాట్‌ఫారమ్ స్కేలబుల్, మల్టీ ఫేస్‌గా తయారు చేశారు. దీని ధర రూ. 90 వేల నుండి రూ. 1 లక్ష వరకు ఉండవచ్చు. ఇది 2– 5 kWh బ్యాటరీకి సపోర్ట్ చేస్తుంది. 100 నుండి 150 కిలోమీటర్ల వరకు జర్నీ రేంజ్ అందిస్తుంది. ఇందులో తేలికపాటి మెటీరియల్స్, ఎక్కువ సర్వీస్ వ్యవధి, AI ఆధారిత స్మార్ట్ కనెక్టివిటీ ఉంటాయి. Ather ఈ మోడల్‌తో ఉత్తర, మధ్య భారతదేశంలో తన స్థానాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది. 700+ స్టోర్‌లను తెరవాలని ప్లాన్ చేస్తోంది. ఈ స్కూటర్ Ola S1, Bajaj Chetak వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి.






















